Mutton Roast: ఎంతో స్పైసీగా ఉండే మటన్ రోస్ట్ ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ కబాబ్, మటన్ సూప్ లాంటి ఎన్నో వంటకాలు తినే ఉంటాం
- By Anshu Published Date - 08:05 PM, Tue - 5 December 23
మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ కబాబ్, మటన్ సూప్ లాంటి ఎన్నో వంటకాలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా మటన్ రోస్ట్ తిన్నారా. పేరు వింటేనే నోరు ఊరిపోతోంది కదూ.. మరి ఈ మటన్ రోస్ట్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మటన్ రోస్ట్ కి కావలసిన పదార్థాలు
మటన్ – అర కేజీ
నిమ్మరసం – టీ స్పూన్
పసుపు – టీ స్పూన్
ఉప్పు – తగినంత
చాట్ మసాలా – టీ స్పూన్
నూనె – సరిపడినంత
కారం – టీ స్పూన్
ఉల్లిపాయలు – రెండు
మిరియాల పొడి – ఒక స్పూన్
మటన్ రోస్ట్ తయారి విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టి అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. అవి వేగాకా పసుపు, కారం, ఉప్పు, వేయించుకున్నమటన్ ముక్కలు వేసి కలుపుకుని పైన చాట్‌మసాలా, మిరియాల పొడి వేసుకుని కొద్దిసేపు వేయించుకుని నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ రోస్ట్ రెడీ.