Mint Curd Chutney: పుదీనా పెరుగు చట్నీని ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?
మనం తరచుగా పుదీనాని ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనాను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాను ఉపయోగించి ప్రత్యేకంగా కొన్ని వంటలు కూ
- Author : Anshu
Date : 08-02-2024 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
మనం తరచుగా పుదీనాని ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనాను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాను ఉపయోగించి ప్రత్యేకంగా కొన్ని వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. పుదీనా రైస్, పుదీనా చట్నీ, పుదీనా కొబ్బరి చట్నీ ఇలా కొన్ని ప్రత్యేకమైన వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా పెరుగు చట్నీ తిన్నారా. ఒకవేళ ఎప్పుడూ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుదీనా పెరుగు చట్నీకి కావలసిన పదార్థాలు:
కొత్తిమీర తరుగు- కప్పు
పుదీనా- పావు కప్పు
జీలకర్ర- స్పూను
పచ్చి మిర్చి ముక్కలు- స్పూను
అల్లం పేస్టు- అర స్పూను
పెరుగు- ముప్పావు కప్పు
నిమ్మరసం- రెండు స్పూన్లు
చాట్ మసాలా- పావు స్పూను
ఉప్పు, నూనె- తగినంత
ఆవాలు- అర స్పూను
ఇంగువ- చిటికెడు
పుదీనా పెరుగు చట్నీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా చిన్న మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కలిపి మిక్సీలో పేస్టులా చేయాలి. తర్వాత ఒక గిన్నెలో పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇందులో చాట్ మసాలా, ఉప్పు జతచేయాలి. చివర్లో ఆ మిశ్రమానికి పోపు పెడితే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పెరుగు చట్నీ రెడీ.