Korra Biyyam Payasam: పిల్లలు ఎంతగానో ఇష్టపడే కొర్ర బియ్యం చక్కెర పొంగలి ఇలా చేయండి?
మాములుగా నైవేద్యాలకు ఎక్కువగా చక్కెర పొంగలి చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని ఎక్కువగా సమర్పి
- By Anshu Published Date - 05:50 PM, Thu - 14 September 23

మాములుగా నైవేద్యాలకు ఎక్కువగా చక్కెర పొంగలి చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. అయితే చక్కెర పొంగలి కి మామూలుగా మన ఉపయోగించే బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సరికొత్తగా కొర్ర బియ్యంతో చక్కెర పొంగలి తిన్నారా. వినడానికి వెరైటీగా నోరూరించే విధంగా ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొర్ర బియ్యం చక్కర పొంగలికి కావలసిన పదార్దాలు :
కొర్ర బియ్యం – 1/2కప్పు
పెసరపప్పు – 1/2 కప్పు
నెయ్యి – 4 స్పూన్
డ్రై ఫ్రూట్స్ – 1/4 కప్పు
ఇలాచీ పౌడర్ – చిటికెడు
మిల్క్ మెయిడ్ – 200 గ్రాములు
కొర్ర బియ్యం చెక్కర పొంగలికి తయారీ విధానం:-
ముందుగా విడివిడిగా కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టు కోవాలి. ఇప్పుడు బాణలిలో ౩ చెంచాలు నెయ్యి వేసి నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకునే తర్వాత అదే బాణలిలో నానిన పెసరపప్పు వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీరుపోసి పెసరపప్పు సగంపైన ఉడికిన తరువాత కొర్రబియ్యం వేసి మరి కొద్ది నీటిని జోడించి రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్, మిల్క్ మెయిడ్ వేసి 1స్పూన్ నేతిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం చక్కెర పొంగలి రెడీ.