Kodi Pulav Recipe: కోడి పలావ్ ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని మరీ తినేయాల్సిందే?
మాములుగా మనం వెజ్ పలావు, ఆలు పలావ్ అంటూ రకరకాల రెసిపీలు తింటూ ఉంటాం. ఎప్పుడైనా కోడి పులావ్ రెసిపీ తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినకపోతే ఈ రెసిప
- By Nakshatra Published Date - 10:13 PM, Tue - 13 February 24
మాములుగా మనం వెజ్ పలావు, ఆలు పలావ్ అంటూ రకరకాల రెసిపీలు తింటూ ఉంటాం. ఎప్పుడైనా కోడి పులావ్ రెసిపీ తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఈ రెసిపీ కి ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోడి పులావ్ కి కావలసిన పదార్థాలు
అల్లం – కొద్దిగా
వెల్లుల్లి – 2
లవంగాలు – 8
యాలకులు – 8
ధనియాలు – 2 స్పూన్లు
దాల్చిన చెక్క – కొంచెం
గసగసాలు – ఒకటిన్నర స్పూన్లు
జాపత్రి – 1
మరాఠి మొగ్గలు – 2
అనాస పువ్వు – 1
చికెన్ – అరకిలో
ఉప్పు – తగినంత
పసుపు – కొంచెం
పెరుగు – రెండు స్పూన్లు
వెన్న – 1 స్పూన్
నిమ్మకాయ – 1
కోడి పులావ్ తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు తరిగి పెట్టుకోండి. రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలను చికెన్ తయారీ కోసం ఉపయోగించుకోవాలి. మిగిలినవి బిర్యానీ కోసం ఉపయోగించుకోవచ్చు. చికెన్ తయారీ కోసం స్టౌవ్ వెలిగించి ఒక కడాయి పెట్టండి. దానిలో కాస్త నెయ్యి, నూనె వేసి నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మేరినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా తిప్పాలి. అనంతరం మూత పెట్టి చికెన్‌ను ఉడకనివ్వాలి. చికెన్ మొత్తంగా కాకుండా 80 శాతం ఉడికేలా చూసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడకుండా చూసుకోండి. తర్వాత స్టౌవ్ వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టి దానిలో నెయ్యి, నూనె వేయండి. దానిలో జీడిపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి. దానిలో ముందుగా రెడీ చేసుకున్న మసాలాను ఓ మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి.
మసాలా ఎంత బాగా ఫ్రై అయితే పలావ్ అంత టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దానిలో 5 గ్లాసుల నీరు వేయాలి. 1 గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు లేదా రెండున్నర గ్లాసుల నీటి వేయొచ్చు. దానిలోనే ఉప్పు కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపాలి. అన్నం పలుకు వీడిన తర్వాత.. అంటే మూడువంతులు ఉడికిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. నీరు మొత్తం ఇంకిపోయే దాక స్టౌవ్ మీద కలుపుతూ ఉండాలి. నీరు ఇంకి పోయిన తర్వాత స్టౌవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టుకుని.. మంటను సిమ్‌లో ఉంచి ఈ బిర్యానీ పాత్రను దానిపై ఉంచి 15 నిముషాలు ఉడికిస్తే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ.
Related News
Kodi Pulao : అదిరిపోయే కోడి పలావ్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
మూడు ఉల్లిపాయలు బిర్యానీలోకి, రెండు బిర్యానీ కూరలోకి పొడుగ్గా కోసి పెట్టుకోవాలి. 10 మిర్చి బిర్యానీలోకి, 4 మిర్చి కూరలోకి నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.