Kobbari Laddu: ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు.. ట్రై చేయండిలా?
మామూలుగా మనం కొబ్బరితో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూ ఉంటాం. కొందరు కర్రీలు ట్రై చేస్తే మరి కొందరు స్వీట్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇంకొ
- By Nakshatra Published Date - 08:00 PM, Wed - 13 September 23
మామూలుగా మనం కొబ్బరితో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూ ఉంటాం. కొందరు కర్రీలు ట్రై చేస్తే మరి కొందరు స్వీట్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇంకొందరు కొబ్బరిని అనేక రకాల స్వీట్లు తయారీలో గార్నిష్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి పాయసం, కొబ్బరి లడ్డు, కొబ్బరి చెట్ని, కొబ్బరి అన్నం అంటూ ఇలా రకరకాల రెసిపీలు తయారుచేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆంధ్ర స్టైల్ కొబ్బరి లడ్డు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆంధ్ర స్టైల్ కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు:
నెయ్యి – 2టేబుల్ స్పూన్లు
తురిమిన కొబ్బరి – 2కప్పులు
బెల్లం – 1/5కప్పు
యాలకుల పొడి – 1/2టేబుల్ స్పూన్
కోవా -1కప్పు
పొడిచక్కెర – 5 టేబుల్ స్పూన్స్
ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు తయారీ విధానం:
ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసి వేడి చేసి అందులో కొబ్బరి, బెల్లం వేయాలి. బెల్లం కరిగే వరకు మీడియం మంట మీద కలపాలి. తడిగా, జిగటగా అయిన తర్వాత అందులో యాలకులపొడి వేసి చల్లబడనివ్వాలి. తరువాత ఒక పాన్ తీసుకొని వేడి అయిన తరువాత అందులో పంచదార పొడి వేసి జిగురు వచ్చేవరకు కలపాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. చిన్న గుండ్రంగా కట్ చేసి, కోవా మిశ్రమాన్ని అందులో వేయాలి.. తర్వాత గుండ్రంగా చిన్న చిన్న లడ్డూలను చేయండి. వాటిపై మీకు నచ్చితే డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు రెడీ.
Related News
Beetroot Kobbari Koora: బీట్ రూట్ కొబ్బరి కూర.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ అవడం ఖాయం?
మామూలుగా మనం బీట్రూట్ తో రకరకాల రెసిపీలు తినే ఉంటాం. బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ రైస్, బీట్రూట్ పులావ్, బీట్రూట్ హల్వా అలాంటి రెసిపీలను తినే ఉ