Kobbari Burelu: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు.. తయారీ విధానం?
చిన్నపిల్లలు పెద్దవారు ఎక్కువగా ఇష్టపడే స్వీట్ ఐటమ్స్ లో కొబ్బరి బూరెలు కూడా ఒకటి. అయితే చాలామంది వీటిని లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు
- By Anshu Published Date - 08:21 PM, Thu - 7 September 23

చిన్నపిల్లలు పెద్దవారు ఎక్కువగా ఇష్టపడే స్వీట్ ఐటమ్స్ లో కొబ్బరి బూరెలు కూడా ఒకటి. అయితే చాలామంది వీటిని లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. కానీ వీటిని ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. మరి ఇంట్లోనే ఈ కొబ్బరి బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి బూరెలకు కావలసిన పదార్దాలు:-
బియ్యం – 1/2 కేజీ
బెల్లం – 3/4 కప్పు
కొబ్బరి కోరు – 1 కొబ్బరికాయతో వచ్చిన కోరు
ఇలాచీ – 1/2 స్పూన్ పొడి
నూనె – సరిపడినంత
కొబ్బరి బూరెలు తయారీ విధానం:
ముందుగా బియ్యం నానబెట్టి కడిగి వాటిని మిక్సీలో లేదా విడిగా బయట మిల్లులో గాని పిండి తయారు చేసుకోవాలి. ఈ తడి పిండిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం చిన్నముక్కలుగా చేసుకొని కొద్దినీరు పోసి ఉండపాకం రానివ్వాలి. ఆ పాకంలో కొబ్బరికోరు వేసి ఇలాచీ పొడి జల్లి వరి పిండి కొద్దికొద్దిగా వేస్తూ మన చలిమిడి ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. చేతికి ఉండలా రావాలి. దానిలో కొద్దిగా నూనె పోసి ప్రక్కన పెట్టుకోవాలి. నూనె వెయ్యడం వల్ల చేతికి అంటుకోకుండా నున్నగా ఈ పిండిని ఉండలు చేసుకుని చేతిలోగాని కవర్ పై గాని, అప్పాల మాదిరి వత్తుకోడానికి సులువుగా ఉంటుంది. బాణలిలో నూనె వేసి బాగా కాగాక మంట తగ్గించి ఒక్కొక్కటిగా ఈ బూరెలను నూనెలో వదలాలి వెంటనే తిరగేసుకోవాలి. ఎందుకంటే ఇవి అతి తక్కువ సమయంలో వేగుతాయి. వీటిని టిష్యు పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ.