No Shave November: “నో షేవ్ నవంబర్” ముఖ్య ఉద్దేశం తెలుసా?
నవంబర్ నెలలో యువకులు గడ్డం పెంచే పద్దతి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి!
- Author : Kode Mohan Sai
Date : 08-11-2024 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
నవంబర్ అనగానే అందరికి గడ్డం గుర్తుకొచ్చే విధంగా మారిపోయింది. మగవాళ్లలో ముఖ్యంగా ఈ నెలలో గడ్డం పెంచడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. దీనికి కారణం “నో షేవ్ నవంబర్” (No Shave November). ఈ పేరుతో నవంబర్ నెలలో యువకులు తమ గడ్డాన్ని కత్తిరించకుండా పెంచే సంప్రదాయం వచ్చింది. అయితే, ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా మందికి తెలియకపోవచ్చు.
“నో షేవ్ నవంబర్” (No Shave November) అంటే గడ్డం పెంచడం మాత్రమే కాదు, ఇది 2009లో ప్రారంభించబడింది. అప్పట్లో అమెరికాలోని “కొన్సర్వేటివ్ ఫౌండేషన్” అనే సంస్థ గడ్డం పెంచడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లపై అవగాహన పెంచేందుకు ప్రారంభించింది.
ఈ నెలలో, వ్యక్తులు తమ గడ్డాన్ని పెంచుతూ, షేవింగ్ కాస్ట్ ని ఆపి, ఆ డబ్బును క్యాన్సర్ పోరాటానికి దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అభియాన్ ద్వారా ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన పెంచడంతో పాటు, ఆర్థిక సహాయం కూడా పొందాలనే ఉద్దేశంతో ఇది ప్రచురణ పొందింది. “నో షేవ్ నవంబర్” (No Shave November) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలవాటుగా మారింది. దేశాల వారీగా యువకులు తమ గడ్డం పెంచి, క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
ఇక, గడ్డం పెంచడంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతారు. కానీ, ఇదంతా ఒక సామాజిక అవగాహన గల కార్యక్రమం మాత్రమే. కాబట్టి, నవంబర్ నెలలో గడ్డం పెంచడం అనేది సింపుల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కాకుండా, ఓ విలువైన సంకేతం, సమాజంలో పెద్దమొత్తంలో క్యాన్సర్ వ్యాధులపై అవగాహన పెంచడమే ముఖ్య ఉద్దేశం.