Instant Dosa : మినపపిండి లేకుండా.. నిమిషాల్లో ఇన్ స్టంట్ దోసెలు.. ఇలా చేస్కోండి
టిఫిన్ తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఇడ్లీ, దోస, పూరీ, మైసూర్ బజ్జీ, గారె, మినప బజ్జీ, చపాతి, ఉప్మా.. ఇలా చాలా రకాల టిఫిన్లే ఉన్నాయి. ఒక్కోసారి ఇంట్లో ఏదో పనిపడి తర్వాతిరోజుకి టిఫిన్ చేసేందుకు ఏమీ ఉండవు. అలాంటప్పుడు గంటలతరబడి పప్పును నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా.. నిమిషాల్లోనే ఇన్ స్టంట్ దోసెలను వేసుకోవచ్చు.
- By News Desk Published Date - 05:48 PM, Tue - 3 September 24
Instant Dosa Recipe : ప్రతిరోజూ ఉదయం మనకు టిఫిన్ చేయడం అలవాటు. పల్లెల్లో అయితే చద్దన్నమే బ్రేక్ ఫాస్ట్. కానీ మనం పట్నమోళ్లం కదా. టిఫిన్ తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఇడ్లీ, దోస, పూరీ, మైసూర్ బజ్జీ, గారె, మినప బజ్జీ, చపాతి, ఉప్మా.. ఇలా చాలా రకాల టిఫిన్లే ఉన్నాయి. ఒక్కోసారి ఇంట్లో ఏదో పనిపడి తర్వాతిరోజుకి టిఫిన్ చేసేందుకు ఏమీ ఉండవు. అలాంటప్పుడు గంటలతరబడి పప్పును నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా.. నిమిషాల్లోనే ఇన్ స్టంట్ దోసెలను వేసుకోవచ్చు.
ఇన్ స్టంట్ దోసెపిండికి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – 1 కప్పు
ఉప్పు – టేస్ట్ కు సరిపడా
చిల్లీ ఫ్లేక్స్ – 1 టీ స్పూన్
గ్రీన్ మిర్చి – 2
కరివేపాకు – 1 రెమ్మ
జీలకర్ర – 1/2 టీ స్పూన్
మిరియాలపొడి – 1/2 టీ స్పూన్
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి వేసుకుని.. అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర, మిరియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, చిల్లీఫ్లేక్స్, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా నీరు కలుపుతూ దోసె పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ పై దోశ పాన్ పెట్టి.. వేడయ్యాక దానిపై ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో దోసెలు వేసుకుని.. చుట్టూ ఆయిల్ వేసి రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. అంతే.. టేస్టీ దోసెలు రెడీ.
బియ్యంపిండితో దోసెలు తయారీకి కావలసిన పదార్థాలు
కావలసిన పదార్థాలు
బియ్యం పిండి – 1.1/2కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3
ఉప్పు – టేస్ట్ కు కావలసినంత
కరివేపాకు – 2 రెమ్మలు
క్యారెట్ తురుము – కొద్దిగా
జీలకర్ర – కొద్దిగా
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తరిగిన ఉల్లిపాయ – 1
బొంబాయి రవ్వ- 1/2 కప్పు
తురిమిన అల్లం – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యం పిండి, బొంబాయిరవ్వ తీసుకుని.. అందులో కొద్దిగా నీరు పోసి కలుపుకోవాలి. అందులోనే అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన మిర్చి, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర, రుచికి కావలసినంత ఉప్పు వేసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి.
స్టవ్ పై పెనం పెట్టి.. వేడయ్యాక దానిపై దోసెలు వేసుకుని.. ఆయిల్ వేసి క్రిస్పీగా కాల్చుకుంటే చాలు. వేడి వేడిగా ఇన్ స్టంట్ రవ్వ దోసెలు రెడీ. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది.
Related News
Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150
లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు