Meanings of Dream: ఇవి కలలో వస్తే…ఫలితం ఎలా ఉంటుందో తెలుసా..?
మనిషి అన్నాక కలలు రావడం సాధారణం. ప్రతిఒక్కరికి ఏదొక కల వస్తూనే ఉంటుంది. కొన్ని పీడకలలు కూడా ఉంటాయి.
- By hashtagu Published Date - 07:20 AM, Fri - 3 June 22

మనిషి అన్నాక కలలు రావడం సాధారణం. ప్రతిఒక్కరికి ఏదొక కల వస్తూనే ఉంటుంది. కొన్ని పీడకలలు కూడా ఉంటాయి. కొందరికి భిన్నమైన కలలు వస్తుంటాయి. పురణాలు చెబుతున్న ప్రకారం…కలలో కనిపించినవి నిజం అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి కలలు వస్తే…ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. అదే మాంసం తింటున్నట్లు కలవస్తే.. మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి.
2. కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్ధం. అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే మీరు ప్రయాణం చేస్తారని అర్థం.
3. కాళ్లు, చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే.. మీకున్న అన్ని రకాల దుఖాలు, సమస్యలు తొలగిపోతున్నాయని తెలుసుకోవాలి. అలాగే కలలో పెళ్లి కూతురును ముద్దాడుతున్నట్లు కనిపిస్తే సమస్యలు పోతాయని తెలుసుకోవాలి.
4. మీకు కలలో పాములు కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని గుర్తుపెట్టుకోవాలి. కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం చేసుకోవాలి.
5. కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్ధం చేసుకోవాలి. అలాగే మీరు కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా ఇదే ఫలితం వస్తుంది. అదే కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్ధం.
6. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కల వస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని… నెమలి కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట.
7. మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభ కార్యం జరుగుతుందని అర్ధం.
8. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలుజారి పడినట్లు కల వస్తే మీకు అష్టకష్టాలు తప్పవని తెలుసుకోవాలి.
9. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం కలుగుతుందట. గుర్రం మీద నుంచి పడినట్లు కల వస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయని అర్ధం చేసుకోవాలి.
10. సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం, ప్రసాదం లభించినట్లు, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, పాము కరిచినట్లు, ఆలయాన్ని చూసినట్లు, నగలు దొరికినట్లు, ఏనుగుపై స్వారీ చేసినట్లు, పండ్లు తిన్నట్లు, శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే ధనలాభం కలుగుతుందని అర్ధం చేసుకోవాలి.
11. కలలో రక్తం కనపడినా, స్తనపానం చేసినట్లు కల వచ్చినా, నూనె తాగినట్లు కల వచ్చినా, స్వీట్లు తిన్నట్లు, వివాహం అయినట్లు కలలు వచ్చినా, కలలో పోలీసులను చూసినా, గుండు చేయింంచుకున్నట్లు కల వచ్చినా వారు మరణ వార్త వింటారు.