Romance : ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటే మీకు ఆ బాధలే ఉండవు !!
Romance : నిద్ర సమస్యలు ఉండే వారు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటే నిద్ర గణనీయంగా మెరుగవుతుందని గుర్తించబడింది
- By Sudheer Published Date - 01:34 PM, Sat - 19 July 25

ప్రస్తుత బిజీ లైఫ్ చాలామంది శృంగారానికి దూరంగా ఉంటూ..లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయే..పడకసుఖానికి దూరం అవుతున్నారు. ఇలా దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఈ ఒత్తిడిని నియంత్రించేందుకు సహజమైన మార్గం శారీరక సంబంధం (S**ual Intimacy) అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్రమం తప్పకుండా భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
PM Modi : దౌత్య విభేదాల తర్వాత.. తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ
2023లో జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. శృంగార సమయంలో మెదడులో “ఆక్సిటోసిన్” (Oxytocin), “డోపమైన్” (Dopamine) వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఆనందానికి, భద్రత భావనకు, మరియు నమ్మకానికి ప్రతీకలు. ప్రత్యేకంగా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శారీరక స్పర్శ ద్వారా బయటకు వస్తుంది. ఇది మనం ప్రేమించిన వ్యక్తితో మానసికంగా ఇంకా బలమైన బంధాన్ని ఏర్పరచేలా చేస్తుంది. ఈ శక్తివంతమైన హార్మోన్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి.
Fire Break : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. ఐటీసీ గోదాం మంటల్లో ఆహుతి
“శారీరక సంబంధం శారీరక అవసరాలకే కాదు, భావోద్వేగ స్థిరత్వానికీ ఒక చిహ్నం.” కూడా. భాగస్వాముల మధ్య పరస్పర విశ్వాసం, అంగీకారం ఉన్నపుడే శృంగార సంబంధం పూర్తి సంతోషాన్ని ఇస్తుంది. శారీరక సంబంధం తర్వాత “ప్రోలాక్టిన్” అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది మెదడుకు విశ్రాంతిని కలిగించి మంచి నిద్రను కలిగిస్తుంది. నిద్ర సమస్యలు ఉండే వారు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటే నిద్ర గణనీయంగా మెరుగవుతుందని గుర్తించబడింది. కాబట్టి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవితం కోరుకునే వారు భాగస్వామితో ప్రేమతో, పరస్పర గౌరవంతో శారీరక సంబంధం కొనసాగించాలి. ఇది శరీరానికీ, మనసికీ ఒక సహజ చికిత్సగా మారుతుంది. అయితే నిర్బంధంగా లేదా ఏకపక్షంగా ఉండే శారీరక సంబంధాలు మానసికంగా తీవ్రమైన ప్రభావం చూపుతాయి.