Dark Circles: ఒకే ఒక్క రోజులో డార్క్ సర్కిల్స్ ని మాయం చేసే సూపర్ చిట్కాలు.. ఇంతకీ అవేంటంటే?
కేవలం ఒకే ఒక్క రోజులో కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలను పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Sun - 23 March 25

ఇటీవల కాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డార్క్ సర్కిల్స్ సమస్య కూడా ఒకటి. కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం మొత్తం అందవిహీనంగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ డార్క్ సర్కిల్స్ ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో మేకప్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికి చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే అవి ఏమీ లేకుండా ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డార్క్ సర్కిల్స్ ని తగ్గించడంలో టొమాటో నిమ్మకాయ ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయితే ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టమోటా జ్యూస్ వేసి అందులోనే కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఇవి రెండు బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో నల్లటి వలయాలపై అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే ఒకే ఒక్క రోజులో డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి అని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ కు పెట్టిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలట. ఆ తర్వాత సాధారణ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేవలం ఒక్క రోజులోనే తేడా కనిపిస్తుందని చెబుతున్నారు.
డార్క్ సర్కిల్స్ ని తగ్గించడంలో కీరదోసకాయ కూడా ఎంతో బాగా పనిచేస్తుందట. ఇందుకోసం కీరదోసకాయను తీసుకుని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయాలి. కావాలనుకుంటే కీరదోసకాయ ముక్కలను నేరుగా కూడా కళ్లపై పెట్టవచ్చట. కీరదోసకాయను ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుతాయట. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల ఫలితాలు చాలా తొందరగా కనిపిస్తాయని చెబుతున్నారు.
కాగా డార్క్ సర్కిల్స్ ని తగ్గించడంలో కలబంద కూడా ఎంతో బాగా పనిచేస్తుందట. అయితే ఇందుకోసం కలబందను కళ్ళ కింద అప్లై చేసి అలాగే పెట్టుకోవాలట. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. రాత్రి పూట పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయట. పైన చెప్పిన విషయాలు పాటిస్తే తప్పకుండా ఒకటి రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ అవడం మీరు గమనించవచ్చు అని చెబుతున్నారు.