HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Prevent Pimples On Face Forever Naturally At House

Beauty Tips: మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి!

మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు మొటిమల సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు..

  • By Anshu Published Date - 10:00 AM, Sat - 12 April 25
  • daily-hunt
Beauty Tips
Beauty Tips

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మొటిమల సమస్య కూడా ఒకటి. ఒక వయసు వచ్చిన తర్వాత ఈ మొటిమల సమస్య ప్రారంభమవుతూ ఉంటుంది. మొటిమలు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఫేస్ క్రీములు మాడిన ఈ మొటిమలు మాత్రం తగ్గవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి రోజూ రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల చర్మం జిడ్డు తగ్గి మృత కణాలు వదిలిపోతాయని చెబుతున్నారు. అలా అని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుందట. కఠినమైన సబ్బులు చర్మానికి చికాకు పరుస్తాయట. అందుకే మృదువైన సబ్బులనే వాడుకోవాలని చెబుతున్నారు. తువ్వాలుతో గట్టిగా రుద్దటం వంటివి చేయవద్దని చెబుతున్నారు. మెత్తటి తువ్వాలును ముఖానికి అద్దుతూ సున్నితంగా తుడుచుకోవాలని సలహా ఇస్తున్నారు.

అలాగే మనలో చాలా మంది మొటిమలను గిల్లుతుంటారు. తరచూ చేతులను ముఖానికి తాకిస్తుంటే బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందట. ఇలా చేస్తే అప్పటికే ఉబ్బి ఉన్న చర్మం మరింత చికాకుకు గురవుతుందట. అలాగే మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివి అస్సలు చేయకూడదట. ఇలా చేస్తే బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చని చెబుతున్నారు.

మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫౌండేషన్‌, పౌడర్‌ అద్దుకోకూడదని చెబుతున్నారు. ఒకవేళ మేకప్‌ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తుడిచేసుకోవాలని చెబుతున్నారు. వీలు ఉంటే నూనె లేని సౌందర్య సాధనాలు, మొటిమలకు కారణం కానివి ఎంచుకోవాలట. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు అతిగా మేకప్ వేసుకోకూడదట..

మనలో చాలా మంది తరచూగా నూనె పెట్టి రాత్రంతా వదిలేస్తుంటారు. ఇలా తల మీది నూనె నుదురుకు తాకి, మొటిమలు వచ్చే అవకాశముందట. అప్పటికే ఉన్న మొటిమలు మరింత ఎక్కువ అవుతాయట. ఇంకా నూనె ముఖం మీదికి వ్యాపించి, చర్మ రంధ్రాలను మూసేయవచ్చట. అందుకే మృదువైన షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలని చెబుతున్నారు. ఒకవేళ పొడవైన జుట్టున్నట్టయితే ముఖం మీదికి రాకుండా చూసుకోవాలట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • home-remedies
  • natural tips
  • pimples

Related News

Dark Circles Shared

Dark Circles : కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్‌ పొగొట్టే ఒకే ఒక సింపుల్ టెక్నిక్ ఎలా చేయాలో తెలుసా?

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వైద్యపరమైన సమస్య కాకపోయినా.. ఇది మీ రూపాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఆత్మ విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి చాలా మంది ఖరీదైన క్రీములు, మందులు వాడుతుంటారు. అయితే, వీటి వల్ల ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఓ సింపుల్ టెక్నిక్‌తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని ఎక్స్‌పర్ట్ అంటున్నారు. ఈ రోజుల్

  • Face Masks For Men

    ‎Face Masks for Men: మగవారు ఈ పేస్ కొన్ని మాస్క్ లు ఉపయోగిస్తే.. ముఖం మెరిసిపోవాల్సిందే!

  • Dye Hair

    Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!

Latest News

  • Grama Panchayat Elections : తెలంగాణ కొత్త మద్యం షాపులకు ‘పంచాయితీ ఎన్నికల’ కిక్కు!

  • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

  • Spirituality: మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే!

  • ‎Tuesday: మంగళవారం రోజు హనుమంతుడిని పూజిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

  • Evil Eye: ‎నరదృష్టితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కర్పూరంతో ఇలా చేయాల్సిందే!

Trending News

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd