Onion Pickle : ఉల్లిపాయతో అదిరిపోయే చట్నీ.. ఇంట్లో సింపుల్ గా చేసుకునేలా రెసిపీ..
ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉల్లిపాయలతో(Onions) కూడా పచ్చడి చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయతో కూడా రుచికరమైన చట్నీ(Onion Pickle) చేసుకొని తినవచ్చు.
- By News Desk Published Date - 10:30 PM, Tue - 29 August 23

మనం ఉదయం(Morning) పూట టిఫిన్లకు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఇలా రకరకాల చట్నీలను పెట్టుకొని తింటూ ఉంటాము. ఈ మధ్య కురగాయల(Vegitabes) రేట్లు బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉల్లిపాయలతో(Onions) కూడా పచ్చడి చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయతో కూడా రుచికరమైన చట్నీ(Onion Pickle) చేసుకొని తినవచ్చు. దీనిని ఇడ్లీ, దోసె, చపాతీ మరియు అన్నంతో పాటుగా తినవచ్చు.
ఉల్లిపాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు..
* నూనె కొద్దిగా
* శనగపప్పు ఒక స్పూన్
* మినపపప్పు ఒక స్పూన్
* ఎండు మిర్చి పది
* కరివేపాకు నాలుగు రెబ్బలు
* ధనియాలు ఒక స్పూన్
* జీలకర్ర ఒక స్పూన్
* ఉల్లిపాయలు మూడు చిన్నగా తరిగినవి
* ఉప్పు తగినంత
* పసుపు చిటికెడు
* చింతపండు కొద్దిగా
* కొత్తిమీర కొద్దిగా
* తాలింపు దినుసులు కొన్ని
ముందు పొయ్యి మీద ఒక చిన్న మూకుడు తీసుకొని దానిలో నూనె వేసి వేడి చేయాలి దానిలో శనగపప్పు, మినపపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. అవి వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లో పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. తరువాత అదే మూకుడులో మనం ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు మిక్సి జార్ లో అంతకు ముందు వేయించి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సి లో పట్టుకోవాలి. తరువాత మగ్గిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమం వేసి మిక్సి పట్టుకోవాలి. మెత్తగా అవ్వకపోతే కొద్దిగా నీరు పోసి మెత్తగా అయ్యేవరకు మిక్సి పట్టుకోవాలి. తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపుకి ఉల్లిపాయల మిశ్రమం, అంతకుముందు మిక్సీ చేసిన మిశ్రమం అన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఉల్లిపాయ పచ్చడి రెడీ. దీనిని ఎటువంటి టిఫిన్ కైనా పెట్టుకొని తినవచ్చు లేదా అన్నంలో కూడా కలుపుకొని కూడా తినవచ్చు. ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది.
Also Read : Prawns Biryani: ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ.. ఇంట్లోనే చేసుకోండిలా?