HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Prepare Kandi Pachadi In Home Simple Recipe

Kandi Pachadi : ఇంట్లో సింపుల్‌గా కంది పచ్చడి తయారీ..

కంది పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది.

  • Author : News Desk Date : 06-11-2023 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
How to Prepare Kandi Pachadi in Home Simple Recipe
How to Prepare Kandi Pachadi in Home Simple Recipe

మనం రోజువారి ఆహారంలో అనేక రకాల పచ్చళ్ళు(Pickle) తింటాం. నిల్వ ఉండే పచ్చళ్ళు, ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు.. బోలెడు ఉంటాయి. వీటిల్లో కంది పచ్చడి ఒకటి. కంది పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది.

కంది పచ్చడికి కావలసిన పదార్థాలు..

* కందిపప్పు ఒక కప్పు
* శనగపప్పు ఒక స్పూన్
* మినపపప్పు ఒక స్పూన్
* ఆవాలు ఒక స్పూన్
* జీలకర్ర ఒక స్పూన్
* మెంతులు ఒక స్పూన్
* ఎండుమిర్చి ఎనిమిది
* ఇంగువ కొద్దిగా
* ఉప్పు ఒక స్పూన్
* చింతపండు కొద్దిగా
* కొత్తిమీర ఒక కట్ట
* కరివేపాకు కొద్దిగా

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో నూనె లేకుండా కందిపప్పును దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిని తీసేసి పక్కన పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారాక వాటిలో వేయించిన కందిపప్పు, ఉప్పు, చింతపండు, కొత్తిమీర వేసి మిక్సి పట్టుకోవాలి. మిక్సి పట్టేటప్పుడు కొన్ని నీళ్ళు పోయాలి అప్పుడు పచ్చడి మెత్తగా తయారవుతుంది.

అనంతరం ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, సాయిపప్పు, ఆవాలు, ఇంగువ వేసుకొని తాలింపు వేయాలి. దానిని మెత్తగా నలిగిన కంది పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కందిపచ్చడి(Kandi Pachadi) తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • Kandi Pachadi
  • Kandi Pachadi Recipe
  • Red Gram

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

    Latest News

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

    • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

    Trending News

      • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd