Under Arms: అండర్ ఆర్మ్స్ లో నలుపు తగ్గాలి అంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు మీకు తెలుసా?
అండర్ ఆర్మ్స్ లో నలుపుని పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు నలుపుదనం పోవడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:00 PM, Wed - 14 May 25

అండర్ ఆర్మ్స్ లో ఉండే నలుపును పోగొట్టుకోవడానికి చాలామంది అమ్మాయిలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు నాచురల్ పద్ధతులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా అండర్ ఆర్మ్స్ లో ఉండే నలుపు మాత్రం పోదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువగా స్లీవ్ లెస్ డ్రస్సులను ఎక్కువగా ధరిస్తున్నారు.
అబ్బాయిలు కూడా అలాంటి బనియన్ లేదంటే టీ షర్ట్ ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే ఇలాంటివి వేసుకున్నప్పుడు చంకల భాగంలో నలుపు ఉంటే అది చూడడానికి కాస్త అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు ఈ విషయం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. మరి అందుకోసం ఏం చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ అప్లై ఉండాలి. ఇలా చేయడం వల్ల అక్కడ చర్మం నలుపు సమస్యను తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ కారణంగా కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతాయి.
కాబట్టి ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి స్క్రబ్బర్ తో రుద్దాలట. అక్కడ ప్రదేశం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి హార్ష్ గా లేని స్క్రబ్బర్ ఉపయోగించడం మంచిది అని చెబుతున్నారు.అలాగే మార్కెట్లో అండర్ ఆర్మ్స్ తెల్లగా చేసే క్రీములు చాలా అందుబాటులో ఉంటాయి. అయితే వాటిని పొరపాటున కూడా వాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అందులో హాని చేసే కెమికల్స్ చాలా ఉంటాయట. అండర్ ఆర్మ్స్ లో వెంటుక్రలను తొలగించడానికి షేవింగ్ వాడుతున్నట్లయితే దాని బదులు వ్యాక్స్ చేయించుకోవడం మంచిది అని చెబుతున్నారు. వ్యాక్స్ చేయించడం వల్ల డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుందట. దీంతో నలుపు సమస్య పెద్దగా ఉండకపోవచ్చని చెబుతున్నారు.