HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Home Remedies To Treat Chapped Lips

Lips: పదే పదే పెదవులు పొడిబారుతుంటే ఈ చిట్కాలను ఉపయోగించాల్సిందే?

చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పొడిబారుతూ ఉంటాయి. పెదవులు పొడి బారడంతో పాటు కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. దా

  • Author : Anshu Date : 04-08-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lips
Lips

చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పొడిబారుతూ ఉంటాయి. పెదవులు పొడి బారడంతో పాటు కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. దాంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే పెదవులు పొడి బారకుండా ఉండడం కోసం అనేక రకాల బ్యూటీ, ప్రోడక్ట్స్,హోమ్ రెమిడీస్ ఫాలో అవుతూ ఉంటారు. మరి పెదాలు పొడిబారకుండా ఉండడం కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేయాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడు చందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది. అలాగే టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డు లోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగెయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది.

అదేవిధంగా కొబ్బరి నూనె, లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్ లో ఒకటి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్, లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్ కలపి పెదవుల మీద రాసి అలాగే వదిలేయాలి. రోజులో ఇలా రెండు మూడు సార్లు ఇలా రాయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసి రాత్రంతా కూడా వదిలేయవచ్చు. ఇలా చేయడం వల్ల పెదవులు పొడి బారే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఐదారు గులాబీ రేకులని పావు కప్పు పచ్చి పాలలో రెండు మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఈ రేకుల్ని మెత్తటి పేస్ట్ లా చేత్తో నలపాలి. ఈ పేస్ట్ ని పెదవులకి పట్టించి 20 ఉంచాలి. ఆపై చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి వారమంతా చేయాలి. ఒక కీరా ముక్క తీసుకుని లిప్స్ మీద రబ్ చేయండి. ఆ జ్యూస్ ని పది నిమిషాల పాటు మీ లిప్స్ మీద అలా వదిలేసి ఆ తరువాత కడిగేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chapped lips
  • home-remedies
  • Lips
  • lips tips

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd