Oily Skin Tips: ముఖం పదే పదే జిడ్డుగా అవుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?
కొందరు ఎన్నిసార్లు ముఖం కడిగినా కూడా జిడ్డుగా మారుతూ ఉంటుంది. స్నానం చేసి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత కూడా వెంటనే ముఖం జుట్టు
- By Nakshatra Published Date - 10:30 PM, Fri - 18 August 23
కొందరు ఎన్నిసార్లు ముఖం కడిగినా కూడా జిడ్డుగా మారుతూ ఉంటుంది. స్నానం చేసి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత కూడా వెంటనే ముఖం జుట్టుగా మారుతూ ఉంటుంది. అయితే, ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వాటి బదులుగా హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరి ముఖంపై ఉన్న జిడ్డును తొలగించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజూ రాత్రి వేళ చెంచా పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలా చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోండి. 15 నిమిషాల తర్వాత ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
పసుపులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. అలాగే జిడ్డు చర్మం సమస్య ఉన్నవారు టమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం జిడ్డు తొలగిపోతుంది. అదేవిధంగా స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్‌ను పలుచని స్లైసుల్లా కోసి ముఖంపై ఉంచాలి. యాపిల్ స్లైసులు చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
జిడ్డు చర్మం బాధితులకు నిమ్మరసం మంచి ఔషదం. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలిపండి. ఆ ద్రవంలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. వాటిని కొద్ది సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఒక్కో ఉండను ముఖానికి రుద్ది శుభ్రం చేసుకోవాలి.
దీని వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. చర్మానికి తేమ అందుతుంది. దీనివల్ల ముఖం జిడ్డుగా మారదు. అలాగే అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లనినీటితో కడిగినట్లయితే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు.
అరస్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. మొటిమల సమస్య ఉన్న చోట దాన్ని పూతలా రాసి కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయాలి. దీని వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు తగ్గుతాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాలయ్యాక కడిగేయాలి.
Related News
White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ సింపుల్ చిట్కా ఉపయోగించాల్సిందే?
ప్రస్తుతం రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు లోనే తెల్ల జుట్టు సమ