Palak Paratha: టేస్టీగా ఉండే పాలక్ పరోటా.. తయారీ విధానం?
మామూలుగా రాత్రి సమయంలో అలాగే ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలని అనుకునేవారు పరోటాలు చపాతీ పూరి వంటివి తింటూ ఉంటారు. ఇక వాటిలోకి కాంబి
- By Anshu Published Date - 09:20 PM, Tue - 29 August 23

మామూలుగా రాత్రి సమయంలో అలాగే ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలని అనుకునేవారు పరోటాలు చపాతీ పూరి వంటివి తింటూ ఉంటారు. ఇక వాటిలోకి కాంబినేషన్ గా నాన్ వెజ్ ఐటమ్స్ ని వేసుకుని తింటూ ఉంటారు. బచ్చలికూర అనేది ఐరన్, కాల్షియం, ఆరోగ్యానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. బచ్చలికూర గ్రేవీ, రైస్ బాత్‌లు ఇష్టపడని పిల్లలు లేదా పెద్దల కోసం బచ్చలి కూర పరోటా తయారు చేస్తే చాలు పిల్లలు పెద్దలు అందరూ లొట్టలు వేసుకొని మరి తినేస్తారు.
పాలక్ పరోటా కావాల్సిన పదార్థాలు :
బచ్చలికూర – 200 గ్రాముల
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి – 3 కప్పుల
కారవే – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడ
పాలక్ పరోటా తయారీ విధానం:
ముందుగా మిక్సర్ గిన్నెలో పాలకూర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పాలకూర పేస్ట్ నీ పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, పాలకూర పేస్ట్ వేసి కలపాలి. తర్వాత అవసరమైన మేరకు పాలు వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తర్వాత పిండికి నెయ్యి అద్దుకుంటూ చిన్న బాల్ సైజులో రోల్ చేయాలి. పరోటా షేప్‌లో రోల్ చేయాలి. పాన్‌ను వేడి చేయాలి. ప్యాన్ వేడి అయిన తర్వాత పరోటా వేసి కాల్చాలి. పరోటా మెత్తగా రెండు వైపులా బాగా కాలేవరకు వరకు నెయ్యి వేసి కాల్చుకోవాలి. అంతే వేడి పాలక్ పరోటా రెడీ.