Hair Tips: ఎంత ప్రయత్నించినా కూడా జుట్టు పెరగడం లేదా.. అయితే ఇది ట్రై చేస్తే చాలు జుట్టు ఒత్తుగా పెరగాల్సిందే?
మామూలుగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందమైన పొడవాటి జుట్టును కోరుకుంటుంది. జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంతగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలామంది
- By Anshu Published Date - 07:29 PM, Thu - 28 December 23

మామూలుగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందమైన పొడవాటి జుట్టును కోరుకుంటుంది. జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంతగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలామంది ఈ రోజుల్లో అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ని హెయిర్ ఆయిల్స్ ని వినియోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యతో ఎక్కువగా చాలామంది బాధపడుతున్నారు. ఇక జుట్టు రాలే సమస్యను తగ్గించుకొని జుట్టు ఒత్తుగా పెరగడం కోసం చాలామంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జుట్టు పెరగడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఇక మీదట ఆ దిగులు చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలా జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడం ఖాయం. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..దానికోసం పెసలు తీసుకొని వాటిని రాత్రి అంతా నానబెట్టుకుని తర్వాత ఆ నీటిని వంపేసి ఒక గుడ్డలో వాటిని కట్టి గాలి దూరకుండా చూసుకోవాలి. మరుసటి రోజు అవి మొలకలుగా మారుతాయి. ఆ మొలకలను మిక్సీ జార్లో వేసుకోవాలి.
ఈ మొలకలలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటాయి. వీటి వలన జుట్టు రాలే సమస్య తగ్గి పొడవుగా, ఒత్తుగా పెరుగు పెరగడమే కాకుండా దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మొలకలలో, గుప్పెడు మందరాకులను కూడా వేసుకోవాలి. ఈ ఆకులలో బేటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోయి జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటుంది. అలాగే కుదుర్లు బలంగా తయారు చేస్తుంది. తర్వాత దీంట్లో నాలుగు మందార పువ్వులను కూడా వేసుకోవాలి. దీనిని మెత్తని పేస్టులా చేసుకుని దీనిలో ఆముదం కూడా వేసి కలుపుకోవాలి.
ఈ పేస్ట్ ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 నిమిషాల పాటు ఉంచిన తర్వాత. ఏదైనా గాఢత తక్కువ ఉన్న షాంపూను తీసుకొని తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేసినట్లయితే ఈ సమస్య తగ్గి జుట్టు సిల్కీగా, ఒత్తుగా, పొడుగా పెరుగుతుంది. తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కానీ వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా రెండు వారాల వరకు చేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.