Food Promotes Aging: ఈ 4 ఫుడ్స్ మీ చర్మానికి త్వరగా ముసలితనం తెస్తాయట!!
మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇతర అవయవాల ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. చర్మం ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
- By Hashtag U Published Date - 07:30 AM, Fri - 30 September 22

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇతర అవయవాల ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. చర్మం ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్ని ఫుడ్స్ వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ఎంతలా అంటే వయసు కూడా ఎవరూ కనిపెట్టలేరు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ చర్మం బిగుతుగా ఉంటుంది. కొల్లాజెన్ కూడా సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మీ చర్మంపై ముడతలు రావు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది.ఇంకొన్ని ఫుడ్స్ వల్ల చర్మం లుక్ ను పూర్తిగా దెబ్బతీస్తాయి. ముడతలు, గీతలు ఏర్పడేలా చేస్తాయి. ఆ నాలుగు ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వాటికి దూరంగా ఉందాం..
* వేయించిన ఆహారం
వేయించిన ఆహార పదార్థాలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. కొన్నిసార్లు వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. కానీ మీరు రోజూ వేయించిన ఫుడ్స్ ను తింటే, అది మీ చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి చాలా లిమిటెడ్ గా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
* వైట్ షుగర్
తెల్ల చక్కెర మన ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా వైట్ షుగర్ కనీస వినియోగాన్ని మాత్రమే సిఫార్సు చేస్తారు. ఆహారంలో తెల్ల చక్కెరను అధికంగా ఉపయోగించడం వల్ల, చర్మం మెరుపు క్రమంగా తగ్గుతుంది. వేయించిన ఆహారాల లాగే తెల్ల చక్కెర కొల్లాజెన్ ఉత్పత్తి చేసే ఏజీల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. దీని వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య పెరగడం మొదలవుతుంది.
* వెన్న / వనస్పతి
వెన్న అధికంగా తీసుకోవడం చర్మానికి మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం.. వనస్పతి లేదా వెన్నను ఎక్కువగా తీసుకునే వ్యక్తులలో ముడతలు, ఫైన్ లైన్లు , చర్మం దెబ్బతినే సమస్యలు అధికంగా కనిపిస్తాయి. వనస్పతి ట్రాన్స్ ఫ్యాట్, వెజిటబుల్ ఆయిల్ నుండి తయారవుతుంది. దీని కారణంగా ఇది ఆరోగ్యానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. అటువంటి పరిస్థితిలో, వనస్పతిని అధికంగా తీసుకోవడం చర్మంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది చర్మం యొక్క కొల్లాజెన్ మరియు స్థితిస్థాపకతను దెబ్బతీస్తుంది. బదులుగా మీరు ఆహారంలో ఆలివ్ నూనె లేదా అవకాడో నూనెను ఉపయోగించవచ్చు. ఇవి చర్మానికి సరైనవిగా పరిగణించబడతాయి.
* పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల గురించి ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. కొంతమంది పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మరికొందరు ఆరోగ్యానికి చాలా చెడ్డదిగా భావిస్తారు. దీనికి సంబంధించి అనేక అధ్యయనాలు జరిగాయి. కొంతమంది పాల ఉత్పత్తుల వల్ల చర్మ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మరికొందరికి ఎటువంటి ప్రభావం కనిపించదు. శాస్త్రీయంగా, పాల ఉత్పత్తులు శరీరంలో మంటను పెంచుతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి మిమ్మల్ని అకాల వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తుంది.