Fenugreek Seeds: హెయిర్ ఫాల్ సమస్యనా.. అయితే మెంతులతో ఇలా చేయండి?
మెంతుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల వంటకాలలో మెంతులను ఉపయోగిస్తూ
- By Nakshatra Published Date - 10:30 PM, Mon - 21 August 23
మెంతుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల వంటకాలలో మెంతులను ఉపయోగిస్తూ ఉంటారు. మెంతులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి మెంతులు అందానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. జుట్టు పలుచగా అయిపోయి అంద విహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు.
ఈ సమస్యకు మెంతులతో ఎలా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉన్నాయి. ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. అంతే కాక, బీటా కెరొటిన్ వల్ల జుట్టు ఆరోగ్యం గా పెరుగుతుంది. హెయిర్ లో కొన్ని డెడ్ సెల్స్, కొన్ని లివింగ్ సెల్స్ ఉంటాయి. హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచవలసిన బాధ్యత లివింగ్ సెల్స్ మీదే ఉంటుంది. అందుకు గానూ లివింగ్ సెల్స్ కి చాలా ఎనర్జీ కావాలి, అంటే కార్బో హైడ్రేట్స్ కావాలి. మెంతుల్లో అరవై శాతం కార్బో హైడ్రేట్సే ఉంటాయి కాబట్టి ఇవి లివింగ్ సెల్స్ కి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. ఆయిలీ హెయిర్ ఉన్న చాలా మనికి చుండ్రు సమస్య కూడా ఉంటుంది. పేలు, సొరియాసిస్ వంటి ఇతర సమస్యలకి కూడా మెంతులలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ తో చెక్ పెట్టవచ్చు.
మెంతులు ఈ ఆయిలీ హెయిర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాయి. మెంతులు జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇందు వల్ల జుట్టు సాఫ్ట్ గా షైనీ గా ఉంటుంది. మెంతుల్లో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్ లా కూడా పని చేస్తాయి. మెంతుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్, ఫైటోఈస్ట్రోజెన్స్ హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేస్తాయి. తరచుగా మెంతులు ఉపయోగించే వారికి చుండ్రు సమస్య ఉండదు. మెంతుల్లో ఉండే ఎమైనో ఆసిడ్స్, కాపర్ వల్ల ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ని ఎవాయిడ్ చేయవచ్చు. రెండు టీ స్పూన్ల మెంతులు, నాలుగు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. మెంతుల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి కొబ్బరి నూనె లో కలిపి మెంతుల రంగు మారే వరకూ వెచ్చబెట్టండి. వడకట్టి ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేయండి. ఈ జార్ ని వారం రోజుల పాటూ ఎండలో పెట్టండి. ఆ తరువాత ఇంట్లో ఎండ తగలని చోట ఉంచండి.
రేపు తలస్నానం చేస్తారంటే ఈ రోజు రాత్రి ఈ నూనె తో స్కాల్ప్ అంతా మసాజ్ చేయండి. అంటే, వారానికి రెండు సార్లు మీరు దీన్ని యూజ్ చేయవచ్చు.
Related News
Fenugreek: మెంతులు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?
మెంతుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మెంతులను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఆహారంలో బాగం చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే మెంతులు మంచిదే కదా అని ఎలా పడితే అలా ఎంత మోతాదులో అంటే అంత మోతాదులో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మరి