Eye Liner: ఐ లైనర్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మామూలుగా స్త్రీలు కళ్ళు మరింత అందంగా కనిపించాలని ఐ లైనర్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కు
- By Anshu Published Date - 09:30 PM, Wed - 16 August 23

మామూలుగా స్త్రీలు కళ్ళు మరింత అందంగా కనిపించాలని ఐ లైనర్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. చాలా మంది స్త్రీలు ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా ఐ లైనర్లను ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా కొంత మంది స్త్రీలకు మొదటి సారి ఐ లైనర్లను వాడడం వలన వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఐ లైనర్లను ఇష్టానుసారంగా వాడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. ఐ లైనర్లను అప్లై చేయడం కోసం కొంత మంది నిపుణులను సంప్రదించడమో, లేక దగ్గర్లోని బ్యూటీ పార్లర్ కి వెళ్లి అక్కడ ఉన్న బ్యూటీషియన్లను అడగడం చేస్తుంటారు.
అయితే మరి ఐ లైలర్లను ఎలా ఉపయోగించాలి? ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మందికి అసలు ఐ లైనర్లను వాడిన తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. కానీ ఐ లైనర్లను వాడడం మాత్రమే కాదు వాటిని మన కళ్ల నుంచి రిమూవ్ చేయడం కూడా తెలుసుకోవాలి. సరైన పద్ధతులను ఉపయోగించి ఐ లైనర్లను రిమూవ్ చేస్తేనే మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ మన ఇష్టారీతిన ఐ లైనర్లను రిమూవ్ చేస్తే మాత్రం సమస్యలతో సతమతం కావాల్సి వస్తుంది. అసలు చాలా మంది డాక్టర్లు ఐ లైనర్లను వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.
లిక్విడ్ ఐ లైనర్ ను వాటర్ లైన్ పై అప్లై చేయడం వలన కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైతే ఐ లైనర్లను వాడుతారో వారు పడుకునే ముందు తప్పనిసరిగా మన కళ్ల మీద ఉన్న ఐ లైనర్లను తొలగించి శుభ్రంగా కళ్లను కడుక్కొని పడుకోవాలి.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఐ లైనర్ను రిమూవ్ చేయకుండా అలాగే ఉంచడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో వివరించారు. అంతే కాకుండా ఐ లైనర్ ను వాటర్ లైన్ పై అప్లై చేయడం కంటికి ప్రమాదకరమం. వాటర్ లైన్ ఉన్న ప్రాంతంలో మన కంటిలో ముఖ్యమైన గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు మన కళ్లు సరిగా పని చేసేందుకు ఉపయోగపడే నూనెలను ఉత్పత్తి చేస్తాయి. ఒక వేళ ఆ ప్రదేశంలో ఐ లైనర్ ను అప్లై చేయడం వలన ఆ గ్రంథులు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్లే కంటి వైద్య నిపుణులు ఐ లైనర్లను వాటర్ లైన్ వద్ద అప్లై చేయకూడదట.
మనం తరుచూ వాటర్ లైన్ ప్రాంతంలో ఐ లైనర్లు అప్లై చేయడం వలన అక్కడ ఉండే గ్రంథులు సరిగా నూనెలను ఉత్పత్తి చేయలేవు. అసలు ఆరోగ్య కరంగా ఉన్న గ్రంథులు ఉత్పత్తి చేసే నూనెలు ఆలివ్ ఆయిల్గా ఉంటాయి. కానీ ఇలా తరుచుగా ఐ లైనర్లను వాడడం వలన చెడిపోయిన గ్రంథులు ఉత్పత్తి చేసే నూనెలు మనం వాడే టూత్ పేస్ట్‌లా ఉంటాయి. ఇలా ఆ గ్రంథులు చెడిపోవడం వలన మనం ఏడ్చేటపుడు వచ్చే కన్నీళ్లు కూడా ఆరోగ్య కరంగా ఉండవు. మన కళ్లు ఈ కారణం వలన పొడిబారిపోతాయి.