Eyebro Threading: ఐబ్రోస్ త్రెడ్డింగ్ చేయించుకుంటున్నారా.. అయితే మహిళలు జాగ్రత్త ఇది మీకోసమే!
Eyebro Threading: మహిళలు అందంగా కనిపించడం కోసం ఐబ్రోస్ త్రెడ్డింగ్ చేయించుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు
- By Anshu Published Date - 07:00 AM, Wed - 19 November 25
Eyebro Threading: మాములుగా మహిళలు అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. అందులో ఐబ్రోస్ కూడా ఒకటి. అందంగా కనిపించాలనే ఆసక్తితో బ్యూటీ పార్లర్ కి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఐబ్రోస్ అందంగా కనిపించడం కోసం త్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రమాద కరం అని చెబుతున్నారు. దీని వల్ల ఏకంగా కాలేయ వైఫల్యం రావచ్చట. అయితే వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది నిజం అంటున్నారు. సాంకేతికంగా ఐబ్రో త్రెడ్డింగ్ వల్ల మీ కాలేయం దెబ్బతినదట.
కానీ పార్లర్ లో ఉపయోగించే ఒకే థ్రెడ్ ను అనేక కష్టమర్లకు ఉపయోగించినప్ప్పుడు లేదా ఒకరికి ఐబ్రో థ్రెడ్డింగ్ చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం, అందుకోసం వాడే వస్తువులను శానిటైజ్ చేయకపోయినా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పాటు థ్రెడ్డింగ్ సమయంలో చిన్న శరీరంపై చిన్న కోత పడిన లేదా రాపిడి జరిగినా హెపటైటిస్ బి లేదా సి వంటి రక్తం ద్వారా సంక్రమించే వైరస్ లు శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందట. ఈ వైరస్ లు లక్షణాల త్వరగా కనిపించవట. నిశ్శబ్దంగా శరీరంలోకి వెళ్లి, మీ కాలేయానికి నెమ్మదిగా హాని కలిగిస్తాయని చెబుతున్నారు. దీన్ని గుర్తించకుండా చికిత్స చేయించకుండా అలానే వదిలేస్తే దీర్ఘకాలిక హెపటైటిస్ కాలేయ వాపు, మచ్చలు లేదా అరుదైన సందర్భాల్లో, పూర్తిస్థాయి కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.
ఈ వైరస్ మనకు సోకితే, కామెర్లు, కాలేయ వాపు ,దీర్ఘకాలిక హెపటైటిస్ , కాలేయ వైఫల్యం, తీవ్రమైన సందర్భాల్లో కాలేయ క్యాన్సర్ కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే.. బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల. అవేంటంటే.. మీకు వాడే ఐబ్రో త్రెడ్డింగ్ కొత్తదో కాదో చూసుకోవాలి. వాళ్లు ఇతరులకు వాడిందే మీకు వాడితే మార్చమని చెప్పాలి. మీకు ఐబ్రో చేసే వారు చేతులు శుభ్రంగా కడుకున్నారో లేదో చూడాలి. మీకు వాడే వస్తువులకు శానిటైజ్ చేశారా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పైన చెప్పిన సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు.