Mens Skincare: అబ్బాయిలు హ్యాండ్సమ్ గా కనిపించాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?
ఈ రోజుల్లో కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్టు
- By Anshu Published Date - 09:26 PM, Fri - 1 September 23

ఈ రోజుల్లో కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్టులు, హోమ్ రెమెడీస్ ఉపయోగిస్తున్నారు. అయితే అబ్బాయిలు ఎక్కువగా పింపుల్స్, ముఖం డల్ గా అయిపోవడం టైడ్ కనిపించడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా వారికి చిన్నవయస్సులోనే ముడతలు, గీతలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు ఎదురువుతూ ఉంటాయి. అందంగా కనిపించాలని అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఉంటుంది. అబ్బాయిల స్కిన్‌కేర్ ఫాలో అయితే అందం రెట్టింపు అవ్వడం మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి అందుకోసం అబ్బాయిలు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోజు మీ ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. క్లెన్సింగ్ మీ ముఖంపై పేరుకున్న మురికి, నూనె, మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లతో మీ ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. షేవింగ్‌కు ముందు ఫోమ్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. పాలు, పెరుగు అద్భుతమైన క్లెన్సర్‌గా పనిచేస్తాయి. మీ చర్మాన్ని రోజు మాయిశ్చరైజ్ చేస్తే ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆర్గానిక్ మాయిశ్చరైజర్ అయితే ఇంకా మంచిది. మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి కొబ్బరి నూనె కూడా అప్లై చేయవచ్చు. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌లా సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి పోషణ అందిస్తుంది.
అలాగే యూవీ కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటి కారణంగా చిన్నవయస్సు లోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ముడతలు, పిగ్మెంటేషన్, గీతలు ఏర్పడతాయి. మీ చర్మాన్ని రక్షించడానికి బయటకు వెళ్లే ముందు బయటకు ఎక్స్‌పోజ్ అయ్యే ప్రాంతాలన్నింటికీ సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.. వారానికి ఒకసారి మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తే చర్మంలోని మృతకణాలు తొలగిపోయి కాంతివంతం ఉంటుంది. చర్మంపై డెడ్ సెల్స్ తొలగిమృదువుగా, స్మూత్‌గా, ప్రకాశవంతంగా ఉంటుంది. మీరు వారానికి ఒకసారి మంచి స్క్రబ్‌తో మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి నీరు సహాయపడతాయి నీరు పుష్కలంగా తీసుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. తాజా పండ్లు, కూరగాయల రసాలు తీసుకోవడం ఉత్తమం.