Egg Masala Fry: పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ మసాలా ఫ్రై.. సింపుల్ ట్రై చేయండిలా?
మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. ఎగ్ ఫ్రై,ఎగ్ నూడిల్స్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ,ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ బిర్యానీ, ఎగ్ వేపుడు
- By Nakshatra Published Date - 05:00 PM, Fri - 29 December 23
మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. ఎగ్ ఫ్రై,ఎగ్ నూడిల్స్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ,ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ బిర్యానీ, ఎగ్ వేపుడు ఇలా ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా ఎగ్ మసాలా ఫ్రై చేశారా. ఈ రెసిపీని ఎప్పుడు తినకపోతే ఇంట్లోనే స్పెషల్ గా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఎగ్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్ధాలు:
ఉడికించిన గుడ్లు – 4
ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 4
ఉప్పు – తగినంత
కారం – 1 టీస్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నూనె – నాలుగు టీస్పూన్స్
ధనియాలు – రెండు టీస్పూన్స్
గసగసాలు – రెండు టీస్పూన్స్
ఎండుకొబ్బరి – 1/4 కప్పు
అనాసపువ్వు – 1
దాల్చిన చెక్క – 1
యాలకులు – 3
లవంగాలు – 4
ఎగ్ మసాలా ఫ్రై తయారీ విధానం:
ముందుగా సన్నని సెగ మీద మసాలా దినుసులు అన్నీ ఒక్కోటిగా మంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి. వేపుకున్న మసాలాలని చల్లార్చి మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి ఉడికించిన గుడ్లు వేసి మూత పెట్టి కాస్త ఎర్రబడే దాకా వేపుకుని తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లో పసుపు, కారం అల్లం వెల్లులి ముద్ద వేసి 2 నిమిషాలు వేపుకోవాలి ఉడికించిన గుడ్లని అంగుళం సైజ్ ముక్కలుగా కోసి కూరలో వేసుకోండి ఇంకా మెత్తగా పొడి చేసుకున్న మసాలా కూడా వేసి 2 నిమిషాలు వేపి, పైన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోండి. అంతే ఎగ్ మసాలా ఫ్రై రెడీ.
Related News
Egg Masala Fry: ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఫ్రై.. ట్రై చేయండిలా?
మాములుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల కూరలు చేసుకొని తింటూ ఉంటారు. ఎగ్ ఫ్రై, ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ వేపుడు, ఎగ్ రైస్ ఇలా చాలా ర