Egg Masala Fry: ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఫ్రై.. ట్రై చేయండిలా?
మాములుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల కూరలు చేసుకొని తింటూ ఉంటారు. ఎగ్ ఫ్రై, ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ వేపుడు, ఎగ్ రైస్ ఇలా చాలా ర
- By Anshu Published Date - 08:30 PM, Fri - 4 August 23

మాములుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల కూరలు చేసుకొని తింటూ ఉంటారు. ఎగ్ ఫ్రై, ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ వేపుడు, ఎగ్ రైస్ ఇలా చాలా రకాల వంటలు తినే ఉంటాం. అయితే ఎప్పుడు అయినా ఎగ్ మసాలా ఫ్రై తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇలా ట్రై చేయండి. మరి ఎగ్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎగ్ మసాలా ఫ్రై కావాల్సిన పదార్ధాలు:
ఉడికించిన గుడ్లు – 4
ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 4
ఉప్పు – తగినంత
కారం – 1 టీస్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నూనె – నాలుగు టీస్పూన్స్
ధనియాలు – రెండు టీస్పూన్స్
గసగసాలు – రెండు టీస్పూన్స్
ఎండుకొబ్బరి – 1/4 కప్పు
అనాసపువ్వు – 1
దాల్చిన చెక్క – 1
యాలకులు – 3
లవంగాలు – 4
ఎగ్ మసాలా ఫ్రై తయారీ విధానం:
ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి సన్నని సెగ పై మసాలా దినుసులు అన్నీ ఒక్కోటిగా మంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి. వేపుకున్న మసాలాలని చల్లార్చి మెత్తని పొడి చేసుకోవాలి. తరువాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి ఉడికించిన గుడ్లు వేసి మూత పెట్టి కాస్త ఎర్రబడే దాకా వేపుకుని తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేయించుకోవాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లో పసుపు, కారం అల్లం వెల్లులి ముద్ద వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లని అంగుళం సైజ్ ముక్కలుగా కోసి కూరలో వేసుకోవాలి. తరువాత మెత్తగా పొడి చేసుకున్న మసాలా కూడా వేసి 2 నిమిషాలు అలాగే ఉంచి పైన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ ఎగ్ మసాలా ఫ్రై రెడీ.