Lips: ఇలా చేస్తే చాలు లిఫ్టిక్ వేయకుండానే పెదాలు ఎర్రగా కనిపించడం ఖాయం?
మామూలుగా చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే
- By Anshu Published Date - 08:00 PM, Mon - 18 December 23

మామూలుగా చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పెదాలు ఎర్రగా మారడం కోసం అనేక రకాల బ్యూటీ టిప్స్, రకరకాల హోమ్ రెమిడీలను పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమందికి పెదాలు అలాగే నల్లగా ఉంటాయి. పెదవులు నల్లగా మారడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే మీ పెదాలు ఎర్రగా కనిపించాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. మరి పెదాలు ఎర్రగా కనిపించాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ పెదాలని రెగ్యులర్‌గా లేదంటే వారానికి ఒకసారైనా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
దీని వల్ల పెదాలపై ఉన్న మృతకణాలు దూరం అయ్యి పెదాల రంగు మారుతుంది. అలాగే పెదాలకి స్క్రబ్ చేశాక మాయిశ్చరైజ్ చేయడం కూడా మంచిది. దీని వల్ల పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. పెదాలకి మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదాలు అందంగా తయారవుతాయి. రాత్రి పడుకునే ముందు పెదాలకి లిప్ మాస్క్ వేయండి. దీని వల్ల పెదాలు పొడితనం తగ్గుతుంది. పగిలిన పెదాలు తగ్గుతాయి. ఇలా మాస్క్ వేసుకోవడం వల్ల పెదాలు మృదువుగా మారి అందంగా కనిపిస్తాయి. పెదాల అందాన్ని కాపాడుకోవాలంటే ఖరీదైన క్రీమ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నేచురల్ పదార్థాలు కూడా రాయవచ్చు. అందుకోసం తేనె, కొబ్బరి నూనె, అలోవేరా జెల్ కూడా రాయవచ్చు. అయితే, అవి మీకు సరిపోతాయో లేదో కూడా చూసుకోండి.
కొంతమందికి అలోవెరా లాంటివి పడవు. ఇలా చేయడంతో పాటుగా మరి కొన్ని చిట్కాలను కూడా పాటించాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యమే కాకుండా పెదాలు కూడా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటుకి దూరంగా ఉండాలి. పెదాలని ఎప్పటికీ కొరకకూడదు. కొంతమంది పెద్దలను పదేపదే ఎంగిలితో తడి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా పెదాల పొడి బారడంతో పాటు నల్లగా అవుతాయి.