Beauty Tips: ప్రతిరోజూ కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మామూలుగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కళ్ళు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం
- By Anshu Published Date - 05:15 PM, Fri - 15 December 23

మామూలుగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కళ్ళు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం కళ్లకు కాటుక పెట్టుకోవడంతో పాటు ఐ లైనర్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కాటుక పెట్టుకుంటూ ఉంటారు. అయితే కాటుక పెట్టుకోవడం మంచిదే కానీ ప్రతిరోజు కళ్లకు కాటుక పెట్టుకుంటే అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.. మరి ప్రతిరోజు కాటుక పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాటుక కళ్ళకి అప్లై చేయడం వల్ల కళ్ళ అందం రెట్టింపు అవుతుంది. కానీ, అప్లై చేశాక కొన్ని తప్పులు చేయద్దు. అలా మనం చేసే తప్పుల వల్ల అది కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇతర భాగాలతో పోలిస్తే కళ్ళ చుట్టూ ఉండే చర్మం మరింత సున్నితంగా, మృదువుగా ఉంటుంది. ప్రతి రోజూ అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాటుక అప్లై చేశాక రాత్రి పడుకునే ముందు దీనిని క్లీన్ చేసి పాడుకోవాలి. అలానే పడుకుంటే ఇది కళ్ళ చుట్టు ఉన్న చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. కాటుకలో జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్థాలను వాడాతారు. ఇవి సరిగ్గా క్లీన్ చేయకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది.
అందుకే, కచ్చితంగా రాత్రి దీనిని క్లీన్ చేసిన తర్వాతనే నిద్రపోవడం మంచిది. అలాగే మీరు వాజెలిన్‌తో కూడా కాటుకని క్లీన్ చేయవచ్చు. దీనికోసం మీ చేతికి కొద్దిగా వాజెలిన్ తీసి కాటుక ఉన్న ప్రాంతంలో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇప్పుడు కాటన్ ప్యాడ్ సహాయంతో దీనిని క్లీన్ చేయాలి. మేకప్ క్లీన్ చేయడానికి మీరు క్లెన్సింగ్ మిల్క్‌ని ఎలా వాడతారు. అలాగే కళ్ళ చుట్టూ ఉన్న కాటుకని క్లెన్సింగ్ మిల్క్‌తో క్లీన్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా కాటన్ ప్యాడ్‌పై క్లెన్సింగ్ మిల్క్ అప్లై చేసి తర్వాత కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేయాలి. కాటుకని క్లీన్ చేసేందుకు రోజ్ వాటర్ కూడా బెటర్. ఇది మేకప్‌ని తీసేయడమే కాకుండా చర్మంపై మెరుపుని కూడా తీసుకొస్తుంది. కాబట్టి, రోజ్‌వాటర్‌తో కూడా కాటుకని క్లీన్ చేయవచ్చు.