Milk : పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే వాటిని కనీసం అయిదు గంటలకు ఒకసారి వేడి చేయాలి. పాలు విడిగా తెస్తే ఇంటికి తెచ్చిన వాటిని వెంటనే వేడి చేయాలి.
- Author : News Desk
Date : 22-06-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
పాలు(Milk) అప్పుడప్పుడు విరిగిపోతుంటాయి. పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే వాటిని కనీసం అయిదు గంటలకు ఒకసారి వేడి చేయాలి. పాలు విడిగా తెస్తే ఇంటికి తెచ్చిన వాటిని వెంటనే వేడి చేయాలి. పాల ప్యాకెట్లు వాడితే అవి కూలింగ్ తగ్గిన తరువాత వేడి చేయాలి. కూలింగ్ పాలు వేడి చేస్తే విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి పాల ప్యాకెట్లను నీళ్ళల్లో వేసి ఉంచి కూలింగ్ తగ్గాక పాలను వేడి చేయాలి.
పాలను ఫ్రిజ్ లో ఉంచాలి అనుకుంటే పాలను కాచి చల్లార్చిన తరువాతే గాజు సీసా లేదా స్టీల్ బాటిల్ లో పాలను పోసి నిలువ ఉంచాలి. పాలు ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు డోర్స్ వద్ద పెట్టకూడదు. ఎందుకంటే డోర్స్ వద్ద పాలను ఉంచితే డోర్స్ తీసి పెట్టడం వలన వాటికి కూలింగ్ తగ్గి పాలు విరిగిపోయి అవకాశం ఉంది. ఫ్రీజర్ దగ్గరగా లేదా ఫ్రిజ్ లో వెనక వైపు లేదా కింద అరల్లో పాలను ఉంచితే పాలు విరిగిపోకుండా ఉంటాయి.
పాలు విరిగిపోకుండా ఉండాలంటే మనం వాటిని నిలువ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పాలల్లో ఉప్పు, నిమ్మరసం లాంటివి పడకుండా చూసుకోవాలి. వాటివల్ల పాలు విరిగిపోతాయి. ఒకవేళ పాలు విరిగినా కంగారు పడాల్సిన అవసరం లేదు. విరిగిన పాలను ఉపయోగించి కలాకండ్, పన్నీర్, రసమలై, కోవా వంటివి తయారుచేసుకోవచ్చు.
Also Read : Milk in Dream: కలలో పాలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?