Coffee Powder : కాఫీ పొడితో ఇలా చేస్తే చాలు ముఖం కాంతివంతంగా మారడం ఖాయం?
మనం నిత్యం ఉపయోగించే కాఫీ పొడి కేవలం కాఫీ తాగడానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. వినడానికి ఆశ్చర్యంగా ఉ
- By Anshu Published Date - 09:33 PM, Mon - 15 January 24

మనం నిత్యం ఉపయోగించే కాఫీ పొడి కేవలం కాఫీ తాగడానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కాఫీ పొడిని ఉపయోగించి చర్మ సమస్యలను తొలగించుకోవడంతో పాటు చర్మాని కాంతివంతంగా కూడా మార్చుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాఫీ పొడిని ఫేస్ ప్యాక్ గా చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఒక చిన్న కాఫీ ప్యాకెట్ ను తీసుకొని అందులో కొంచెం అలోవేరా జెల్ కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
ఆరిపోయిన తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపైన ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతి వంతంగా మారుతుంది. మొటిమలను తొలగించడంలోనూ ఇది సహాయపడుతుంది. మూడు టీ స్ఫూన్ల కాఫీ పొడి తీసుకోవాలి. శెనగపిండి ఒక టీ స్ఫూన్, తేనే మూడు టీస్ఫూన్లు, కాస్త నూనె, అలోవేరా జెల్ రెండు టీ స్ఫూన్లు తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత ఆ పేస్టును ముఖంపై ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. దాదాపుగా 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.
దీని వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఈ ప్యాక్ ని ఉపయోగించిన తర్వాత మార్పును మీరే గమనించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం కాంతివంతంగా తయారవ్వాలి అనుకున్న వారు ఎలాంటి సందేహాలు లేకుండా ఈ ప్యాక్ ని మీరు ట్రై చేయవచ్చు.