Fengshui Tips: ఫెంగ్ షుయ్ ఏనుగును ఇంట్లో ఆ ప్రదేశంలో ఉంచితే ఇక డబ్బే డబ్బు..?
రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇదివరకు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా
- By Nakshatra Published Date - 08:30 AM, Thu - 3 November 22
రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇదివరకు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్మనివారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. భారతదేశంలో మనం ఎలా అయితే వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాము అదేవిధంగా చైనీస్ వారు కూడా ఒక వాస్తు శాస్త్రం వుంది. అదే ఫెంగ్ షుయ్. దీని అర్థం ఏనుగు. ఏనుగును చైనీస్ వారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల దీనికి లోటు ఉండదు అని వారు భావిస్తారు.
ఫెంగ్ షుయ్ ఏనుగును ఇంట్లో ఉంచడం వల్ల ఆ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే ఫెంగ్ షుయ్ ఏనుగును కూడా ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకునేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.. ఫెంగ్ షుయ్ ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం,గౌరవం లభించడంతోపాటు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. ఫెంగ్ షుయ్ ని ఇంటి ప్రధాన ముఖద్వారం వద్ద ఉంచడం శుభప్రదం. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు పడకగదిలో రెండు ఏనుగు విగ్రహాలను పెట్టుకోవడం వల్ల త్వరలోనే పిల్లల కలుగుతారు.
అలాగే ఫెంగ్ షుయ్ ఏనుగును ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఏర్పడడంతో పాటు అపారమైన సంపద కూడా లభిస్తుంది. అలాగే ఎప్పుడు నలుపు రంగు ఫెంగ్ షుయ్ ను కొనుగోలు చేయకూడదు. అందుకు గల కారణం ఈ నలుగురంగు ఏనుగు శుభ ఫలితాలను ఇవ్వదు. తెల్ల రంగు ఫెంగ్ షుయ్ ఏనుగు నువ్వు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడు సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏనుగును ఉత్తర దిశలో ఉంచాలి. ఒక జత ఫెంగ్ షుయ్ ఏనుగులను ఇంట్లో ఉంచడంతో పాటు వాటి ముఖాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా వ్యతిరేక దిశలో పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
Related News
Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?
హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి.