chinese chicken: రెస్టారెంట్ స్టైల్ చైనీస్ చికెన్ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?
మామూలుగా మనం చికెన్ తో రకరకాల రెసిపీలను తయారు చేసి చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా సరి కొ
- By Nakshatra Published Date - 05:30 PM, Sun - 24 December 23
మామూలుగా మనం చికెన్ తో రకరకాల రెసిపీలను తయారు చేసి చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా సరి కొత్తగా ట్రై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా చికెన్ తో ఏదైనా కొత్త రెసిపీని ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చైనీస్ చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చైనీస్ చికెన్ కు కావలసిన పదార్థాలు
చికెన్ లెగ్ పీస్ లు – 5
టొమాటో సాస్ – ఒక స్పూన్లు
సోయ్ సాస్ – 1 స్పూన్
వైట్ పెప్పర్ – ఒక స్పూన్
కరివేపాకు – కొద్దిగా
మైదా – 1స్పూన్
చిల్లి సాస్ – 1స్పూన్
నూనె – తగినంత
పచ్చి మిరపకాయలు – 4
కార్న్ ఫ్లౌర్ – 2 స్పూన్స్
కోడి గ్రుడ్డు – 1
అజినోమోటో – చిటికెడు
కారం – రెండు స్పూన్లు
నిమ్మ రసం – ఒక స్పూన్
ఉప్పు – సరిపడా
చైనీస్ చికెన్ తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా ఒక గ్రుడ్డుని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో కార్న్ ఫ్లౌర్, మైదా, సోయ్ సాస్, చిల్లి సాస్, టొమాటో సాస్, నిమ్మ రసం, చిటికెడు అజినోమోటో, వైట్ పెప్పర్, తగినంత కారం, ఉప్పు వేయాలి. ఇందులో గుడ్డు మిశ్రమం వేసుకుని పేస్ట్ ల చేసుకోవాలి. అందులో చికెన్ ముక్కలు వేసి కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పోసి వేడి చేసుకుని అందులో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసిపక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అందులో పచ్చి మిరపకాయలు, కరివేపాకు, వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించి అందులో రెండు కప్స్ నీళ్ళు పోసి మరిగించుకోవాలి. అందులో చిల్లి సాస్, అర స్పూన్ సోయ్ సాస్,అజినోమోటో చిటికెడు కొంచం పెప్పర్, తగినంత ఉప్పు వేసి కలిపి చికెన్ ముక్కలు వేసి నీళ్ళు ఇంకి పోయేంత వరకు ఉడికించి చివరిలోనిమ్మ రసం వేసి కలిపితే చైనీస్ చికెన్ రెడీ.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�