Chilli Paneer: ఎంతో స్పైసీగా ఉండే చిల్లీ పన్నీర్ ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీలు ఎప్పుడూ భర్త పిల్లలకు ఒకే రకమైన వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఏవైనా చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటారు
- By Anshu Published Date - 08:00 PM, Tue - 22 August 23

మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీలు ఎప్పుడూ భర్త పిల్లలకు ఒకే రకమైన వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఏవైనా చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అనుకోగానే సరిపోదు కదా ఆ వంటలు ఎలా తయారు చేయాలి. అందుకే పదార్థాలు కావాలో తెలిసి ఉండాలి. కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్ లో పక్కింటి వారు చెప్పారని ఏదో వంటలు చేసి చెడగొట్టుకుని సరిగ్గా రాలేదని బాధపడుతూ ఉంటారు. అయితే ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకుంటే ఎంతో స్పైసీగా ఉండే చిల్లీ పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చిల్లీ పన్నీర్ కి కావలసిన పదార్ధాలు :
పన్నీర్ -250 గ్రాములు
మైదా – రెండు స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్స్
శెనగ పిండి – ఒక స్పూన్
మిరియాల పొడి – చిటికెడు
కారం – ఒక స్పూన్
ఉప్పు – సరిపడినంత
పసుపు – చిటికెడు
చిల్లి సాస్ – అరచెంచా
సోయా సాస్ – అరచెంచా
టమాటో సాస్ – ఒక స్పూన్
కాప్సికం – రెండు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చి మిర్చి – రెండు
అజినమోటో – అరచెంచా
నీరు – సరిపడినంత
నూనె – వేపుకు సరిపడ్డ
చిల్లీ పన్నీర్ తయారి విధానం :
ఇందుకోసం ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు , కారం, శెనగపిండి, మిరియాల పొడి,పసుపు కొద్దిగా నీరు పోసి దోసె పిండిలా కలుపుకోవాలి. మరి పలుచగా ఉండకూడదు. తర్వాత అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఓ పావుగంట తర్వాత పన్నీర్ ముక్కలని తీసి నూనెలో వేయించాలి. ఎర్రగా వేగాక తీసి పేపర్ టవల్ మీద పెడితే నూనె పీలుస్తుంది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లి, క్యాప్సికం, పచ్చిమిర్చి లని ఒక మూకుడులో రెండు చెంచాల నూనెలో వేయించాలి. అవి ఎర్రగా వేగాగానే, చిల్లి,టమోటా, సోయా సాసులన్నిటిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ కూడా వేసి ,అజినమోటో కూడా చేర్చి బాగా కలిపి స్టవ్ ఆపాలి.