Chicken Soup: ఎంతో రుచికరమైన చికెన్ సూప్ ను ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
- By Sailaja Reddy Published Date - 04:00 PM, Sat - 24 February 24

చికెన్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో చికెన్ సూప్ కూడా ఒకటి. అయితే చాలామందికి ఈ చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో తెలియదు. దాంతో ఆన్లైన్లో ఆర్డర్ చేయడం లేదంటే రెస్టారెంట్ హోటల్స్ కి వెళ్లి తినడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట అలా చేయకుండా ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. మరి ఇంట్లోనే టేస్టీగా రుచికరమైన చికెన్ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ – పావుకిలో
పాలకూర – ఒక కట్ట
మిరియాల పొడి – చిటికెడు
ఉల్లికాడలు – రెండు
బీన్స్ – మూడు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
క్యారెట్ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కార్న్ ఫ్లోర్ – అర స్పూను
నూనె – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
ముందగా చికెన్‌ను శుభ్రం చేసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తర్వాత ఒక గిన్నెలో చికెన్, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. దాదాపు చికెన్ మొత్తం ఉడికిపోవాలి. తరువాత గిన్నెతో పాటు ఆ చికెన్‌ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత గిన్నెలోని చికెన్ ముక్కలను తీసి కడాయి లో వేసి వేయించాలి. ఉప్పు, పాలకూర తరుగు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలపాలి. ఒక పది నిమిషాలు అలా ఉడికించాక చికెన్‌ను ఉడికించిన నీటిని కూడా వేసేయాలి. దీన్ని వేడిగానే ఉన్నప్పుడు తాగాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ రెడీ.