Cauliflower Potato Curry: క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?
మామూలుగా కాలీఫ్లవర్ తో ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అలాగే ఆలూతో కూడా ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. ఆలు కర్రీ, ఆలూ పులావ్, ఆలూ వేపుడు ఇ
- By Anshu Published Date - 08:10 PM, Wed - 6 December 23

మామూలుగా కాలీఫ్లవర్ తో ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అలాగే ఆలూతో కూడా ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. ఆలు కర్రీ, ఆలూ పులావ్, ఆలూ వేపుడు ఇలాంటి ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా కాలీఫ్లవర్ ఆలూ కలిపి తిన్నారా. ఈ రెండు కాంబినేషన్ లో తయారు చేసే రెసిపీ ఎంతో బాగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుటుంది. క్యాలీఫ్లవర్ టమాట, బఠాణీ, ఎగ్స్ ఇలా దేనితో వండినా ఇష్టంగా తినవచ్చు. మరి క్యాలిప్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీకి కావలసిన పదార్థాలు:
క్యాలీఫ్లవర్ – ఒకటి
ఆలూ – రెండు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కరివేపాకు – ఒక రెమ్మ
కొత్తిమీర – ఒక కట్ట
అల్లం – చిన్న ముక్క
వెల్లులి – నాలుగు రెబ్బలు
గరం మసాలా – అర టీ స్పూన్
ఉప్పు,కారం – తగినంత
పసుపు, నూనె – తగినంత
తాలింపు దినుసులు – తగినంత
క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ని చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి వేడినీళ్ళలో కడగాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాలీఫ్లవర్ విడివిడి పువ్వులను వేడి నీళ్ళలో వేస్తే పురుగులు బయటపడిపోతాయి. వాటిని తీసిపారేయాలి. ఆ తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఆలూ ముక్కలతో కలిపి కొంచెం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అల్లం, మిర్చి, వెల్లుల్లి కలిపి గ్రేడ్ చేసుకొని ఈ పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన ఆలూ, క్యాలీఫ్లవర్ వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికే వరకు వేయించాలి, చివరిగా గరం మసాలా, కొత్తి మీర వేసి కలపాలి. అంతే, క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ.