Weekend Dinner : బట్టర్ చికెన్, గ్రీన్ చికెన్ తిని బోర్ కొట్టిందా…ఒకసారి కాశ్మీరీ చికెన్ మసాలా ట్రై చేసి చూడండి..!!
సాధారణంగా వండుకునే చికెన్ కర్రీస్ తిని బోర్ కొట్టిందా. కొద్దిగా భిన్నంగా ఏదైనా తయారు చేయాలనుకుంటే...కశ్మీరీ చికెన్ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి.
- By hashtagu Published Date - 09:19 AM, Sun - 16 October 22
సాధారణంగా వండుకునే చికెన్ కర్రీస్ తిని బోర్ కొట్టిందా. కొద్దిగా భిన్నంగా ఏదైనా తయారు చేయాలనుకుంటే…కశ్మీరీ చికెన్ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. మీఇంటికి వచ్చిన గెస్టులు ఈ కర్రీ తిని ప్రశంసిస్తారు.
కశ్మీరీ చికెన్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దం.
*ముందుగా జీడిపప్పు పేస్ట్, టేస్టుకోసం ఎండుద్రాక్ష పేస్టును తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి.
*చికెన్ మారినేట్ చేయడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులో పసుపు,జీరాపొడి, గరంమసాలా, ధనియాల పొడి, కశ్మీరీ కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలపండి. ఇప్పుడు చికెన్ ముక్కలను మిశ్రమంతో కోట్ చేయండి.
*ఇప్పుడు పాన్ లో నెయ్యి ఇష్టం లేనివారు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక చికెన్ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించండి. అన్నిపొడుల మిశ్రమం వేసి కోట్ చేసాం కాబట్టి…2లేదా 3 నిమిషాలు వేయించాలి. గోల్డ్ కలర్ లోకి రాగానే…వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
*అదే ఆయిల్లో తరిగిన టమోటాలు వేసి అవి మెత్తగా ఉడికించాలి. అందులో 1/2కప్పునీళ్లు పోయండి. సుమారు రెండు లేదా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్టు, ఎండు ద్రాక్ష పేస్టు కలపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి మూతపెట్టండి. పది నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టండి.
*అంతే సింపుల్ కశ్మీరీ చికెన్ మసాలా కర్రీ రెడీ…ఇది చపాతీలో కానీ రైస్ లో కానీ తింటే టేస్ట్ అదిరిపోతుంది.
Related News
Weight Loss: త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినాల్సిందే?
మామూలుగా బరువు పెరగడం చాలా ఈజీ కానీ బరువు తగ్గడం అన్నది ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు