Mobile Usage: బాత్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా.. అయితే జాగ్రత్త ఈ ప్రమాదం తప్పదు!
Mobile Usage: బాత్ రూమ్ లో మైబైల్ ఫోన్ వినియోగించడం మంచిది కాదని,దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. మరి బాత్రూంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Wed - 8 October 25

Mobile Usage: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ ని వినియోగిస్తూనే ఉంటారు. కొద్దిసేపు మొబైల్ ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేరు. కొందరు అయితే బాత్ రూమ్ లోకి కూడా మొబైల్ ఫోన్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఇలా మొబైల్ ఫోన్ ని వాష్ రూమ్ లోకి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఇది ఇది మంచి అలవాటు కాదు అని చెబుతున్నారు.
ఇలా మొబైల్ ఫోన్ ని బాత్రూం లో వినియోగించడం వల్ల బ్యాక్టీరియా వైరస్ లకు కేంద్రంగా మార్చేస్తుందట. ఫ్లష్ చేసిన తర్వాత టాయిలెట్ నుంచి విడుదలయ్యే సూక్ష్మ కణాలు గాలిలో వ్యాప్తి చెంది మొత్తం బాత్రూమ్ ఉపరితలాలపై పేరుకుపోతాయట. కాగా ఈ హానికరమైన సూక్ష్మక్రిములు ఫోన్ లో హానికరమైన సూక్ష్మక్రిములు ప్రవేశించవచ్చని చెబుతున్నారు. ఇవి తరువాత మీ చేతులు, శరీరంలో చేరి వ్యాధులను కలిగిస్తాయట. అందుకే బాత్రూమ్కి వెళ్లే ముందు ఎప్పుడూ మీ ఫోన్ ను బయట ఉంచాలని చెబుతున్నారు.
అంతేకాకుండా చాలా మంది షర్టు జేబులో ఫోన్ పెట్టుకోవడం గుండెకు దగ్గరగా ఉండటం కడా హానికరం అని చెబుతున్నారు. ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకుంటే పర్స్ లేదా బ్యాగ్ లో పెట్టుకోవడం కంటే 2 నుంచి 7 రెట్లు ఎక్కువ రేడియేషన్ వస్తుందట. నిరంతరం రేడియేషన్ కు గురికావడం వల్ల కణితులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే మొబైల్ ఫోన్ ని కారు డాష్‌బోర్డ్ పై స్మార్ట్ ఫోన్ ను ఉంచకూడదట. ఎందుకంటే ఇక్కడ నేరుగా సూర్యరశ్మి పడటం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుందట. ఎక్కువ కాలం వేడిలో ఉండటం వల్ల బ్యాటరీ దెబ్బ తినడం లేదా పాడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా చాలాసార్లు ఫోన్ ను ఛార్జింగ్‌లో పెట్టి రాత్రిపూట అలా వదిలేస్తారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఫోన్ ఓవర్ చార్జ్ అయి పేలిపోయే ప్రమాదం ఉందట. దీనివల్ల పెద్ద నష్టం వాటిల్లుతుందని, అందుకే రాత్రిపూట ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టి నిద్రపోకూడదని చెబుతున్నారు.