Childrens: పిల్లలకు వాంతులు,విరోచనాలు అయినప్పుడు ఎటువంటి ఫుడ్ పెట్టాలో మీకు తెలుసా?
Childrens: మామూలుగా పిల్లలకు అప్పుడప్పుడు వాంతులు విరేచనాలు అవుతూ ఉంటాయి. అయితే అలా వాంతులు విరోచనాలు అయినప్పుడు ఎటువంటి ఫుడ్ పెట్టాలి? ఎటువంటి ఫుడ్ పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 09-12-2025 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
Childrens: సాధారణంగా అప్పుడప్పుడు పిల్లలకు పెద్దలకు వాంతులు విరోచనాలు వంటివి అవడం సహజం. ఇవి మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వాంతులు విరోచనాలు కొన్ని కొన్ని సార్లు ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. పెద్దలు అయితే నీరసాన్ని భరించగలరు కానీ పిల్లలు అయితే వెంటనే శక్తిని కోల్పోతూ నీరసంగా అయిపోతూ ఉంటారు. అయితే నీరసపడిపోయినప్పుడు పిల్లలు కూడా చాలా వరకు ఫుడ్ తీసుకోరు. అలాంటి సమయంలో పేరెంట్స్ కూడా పిల్లలకు ఎటువంటి ఫుడ్ పెట్టాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి పిల్లలకు వాంతులు విరోచనాలు అయినప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పిల్లల అయినా పెద్దలు అయినా వాంతులు విరోచనాలు అయినప్పుడు త్వరగా జీనుమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ తగ్గిన తర్వాత సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని చిన్న మోతాదుల్లో ఇవ్వడం ప్రారంభించాలి. ఇందులో ముఖ్యంగా గంజి. ఇది కడుపును తేలికగా ఉంచుతుందట. శరీరానికి అవసరమైన ద్రవాలు, గ్లూకోజ్ అందిస్తుందని, ఇడ్లీ తేలికగా జీర్ణం అవుతుంది. పొంగల్ / కిచిడి శరీరానికి శక్తిని ఇస్తాయని చెబుతున్నారు.అలాగే ఇవి తేలికగా జీర్ణమవుతాయట. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండును వాంతుల తర్వాత తింటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ భర్తీ అవుతాయట. రసం కూడా కడుపుని తేలిక చేస్తుంది.
సజ్జ జావ, రాగి జావ, ఓట్స్ వంటివి పిల్ల జీర్ణశక్తికి అనుగుణంగా పలుచగా చేసి ఇవ్వవచ్చని చెబుతున్నారు. అలాగే పిల్లలకు స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఏం పెట్టకూడదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఫ్రూట్ జ్యూసులు, ముఖ్యంగా ఆపిల్, ద్రాక్ష, మామిడి జ్యూస్ వంటివి విరేచనాలను మరింత పెంచుతాయట. అలాగే పాల టీ, కారాలు, ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్, చిప్స్, చాక్లెట్‌లు, కూల్ డ్రింక్స్ ఇవ్వడం మంచిది కాదట. ఇవి కడుపులో ఆమ్లతను పెంచి వాంతులు మళ్లీ రావడానికి కారణమవుతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. పిల్లలు తాగే నీరు తప్పనిసరిగా కాచి చల్లార్చి ఇవ్వాలట. ప్లేట్ లు, స్పూన్ లు పరిశుభ్రంగా ఉంచాలని, విరేచనాల సమయంలో పిల్లలకు ఇచ్చే ఆహారం తాజాగా తయారు చేయాలని, నిల్వ ఆహారం ఇవ్వడం చాలా ప్రమాదకరం అని, ఒక రోజుకు మించి వాంతులు, విరేచనాలు కొనసాగితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.