Sorry : ఒక్క “సారీ” మీ రిలేషన్ ను స్ట్రాంగ్ చేస్తుందని మీకు తెలుసా..?
Sorry : మనిషి జీవితం బంధాలతో నిండిపోతుంది. కుటుంబం, స్నేహితులు, భాగస్వామి – వీటిలో ప్రతి ఒక్క బంధం ఎంతో విలువైనది. కానీ చిన్న పొరపాట్ల వల్లే ఈ బంధాలు దెబ్బతింటాయి.
- By Sudheer Published Date - 07:15 AM, Mon - 18 August 25

మనిషి జీవితం బంధాలతో నిండిపోతుంది. కుటుంబం, స్నేహితులు, భాగస్వామి – వీటిలో ప్రతి ఒక్క బంధం ఎంతో విలువైనది. కానీ చిన్న పొరపాట్ల వల్లే ఈ బంధాలు దెబ్బతింటాయి. అభిప్రాయభేదాలు సహజమే అయినప్పటికీ, వాటిని పరిష్కరించే విధానం మన సంబంధాల బలాన్ని నిర్ధారిస్తుంది. మన వల్ల ఇతరులు బాధపడితే నిజాయతీతో “సారీ” (Sorry ) చెప్పడం ద్వారా బంధాన్ని కాపాడుకోవచ్చు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, మనసులోంచి రావాలి.
NTR : ఎన్టీఆర్ ను చూసి భయపడుతున్నారా ? – అంబటి
క్షమాపణ అడగడంలో కూడా కొన్ని దశలు ఉంటాయి. ముందుగా మనం చేసిన తప్పుకు చింతిస్తున్నామన్న భావన ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ తర్వాత ఆ తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నామనే స్పష్టత ఇవ్వాలి. ఇకపై అలాంటి పొరపాటు జరగదనే హామీ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆ తప్పు ఎందుకు జరిగిందో సరళంగా వివరించాలి. అయితే, దానికి సమర్థన చూపకుండా, మన తప్పును ఒప్పుకోవడమే నిజమైన క్షమాపణ అని నిపుణులు సూచిస్తున్నారు.
BRS MLC Father: పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి!
అలాగే క్షమాపణ (Sorry ) కోరడమే కాకుండా, ఎదుటివారు క్షమాపణ అడిగినప్పుడు వారిని నిజాయతీతో మన్నించగల గుణం కూడా ఉండాలి. లేకపోతే ఆ సంఘటన మన మనసులో మిగిలిపోయి మళ్లీ మళ్లీ బాధ కలిగిస్తుంది. క్షమించే గుణం అనేది హృదయాన్ని తేలిక చేయడమే కాకుండా బంధాలను మరింత బలపరుస్తుంది. మనం వారి స్థానంలో ఉన్నామని ఊహించుకొని ఆలోచిస్తే, వారిని క్షమించడం సులభమవుతుంది. ఒకసారి క్షమించిన తర్వాత మళ్లీ ఆ తప్పును గుర్తు చేయకుండా ముందుకు సాగితేనే బంధాలు చిరకాలం నిలుస్తాయి.