Multani Mitti: ప్రతిరోజు ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చా.. ఏవైనా సమస్యలు వస్తాయా?
ముల్తానీ మట్టి గురించి మనందరికి తెలిసిందే. ముల్తానీ మట్టి అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్తానీ మట్టి అం
- By Anshu Published Date - 09:14 PM, Mon - 24 July 23

ముల్తానీ మట్టి గురించి మనందరికి తెలిసిందే. ముల్తానీ మట్టి అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్తానీ మట్టి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇది అన్నిరకాల స్కిన్ ట్రబుల్స్ కు ముల్తానీ మట్టితో పరిష్కారం లభిస్తుంది. ఇది స్కిన్ ప్రాబ్లెమ్ ను తగినట్టుగా దీనిలో ఇంగ్రిడియెంట్స్ ను కలిపి కస్టమైజ్డ్ ఫేస్ ఫ్యాక్స్ ను తయారుచేసుకుని దీని బెనిఫిట్స్ ను పొందవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో స్కిన్ కు అదనపు సంరక్షణను ఇస్తుంది. సమ్మర్ అలాగే వింటర్ సీజన్ల కంటే స్కిన్ కు ఎడిషనల్ కేర్ అనేది వర్షాకాలంలో మరింత ముఖ్యం.
వాతావరణంలో తేమ అనేది స్కిన్ ను మరింత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది. కాబట్టి, స్కిన్ అనేది వివిధ రకాలుగా రియాక్ట్ అవుతుంది. దాంతో, యాక్నే, బ్రేకవుట్, డ్రై పాచెస్, పింపుల్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే, స్కిన్ కండిషన్ ను తెలుసుకుని తగిన కేర్ తీసుకోవాలి. అయితే ముల్తానీ మట్టిని ప్రతిరోజు ఉపయోగించడం మంచిదేనా అలా ఉపయోగించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త సెల్స్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది.
ముల్తానీ మట్టితో స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ సెల్స్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ కు వైబ్రెంట్ లుక్ లభిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు కూడా ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది. ఇందులో నిమ్మరసం అలాగే పెరుగును కలిపి పేస్ట్ లా అప్లై చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ముల్తానీ మట్టిని ముఖంపై రోజూ వాడకూడదు. అతిగా వాడితే, ఇది స్కిన్ లోని నేచురల్ మాయిశ్చరైజర్ ను కోల్పోయేలా చేస్తుంది. స్కిన్ పొడిబారుతుంది. కేవలం వారంలో రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. ముల్తానీ మట్టి అందానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.