Tender Tamarind Leaves : చింతచిగురు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?
చింతచిగురు తినడం వలన మనం ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
- By News Desk Published Date - 08:30 PM, Mon - 13 November 23

చింతచిగురును(Tender Tamarind Leaves) పప్పు లేదా పచ్చడి చేసుకొని తింటాము. అలాగే కొంతమంది పులుసు, సాంబార్ లో వేసుకుంటారు. చింతచిగురు తినడం వలన మనం ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
* చింతచిగురు తినడం వలన అది మన శరీరంలో చక్కర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది.
* కామెర్లు తగ్గడానికి చింత చిగురు ఉపయోగపడుతుంది.
* మనకు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు అవి తగ్గడానికి వాటి పైన చింత ఆకుల రసాన్ని పోయవచ్చు.
* చింతాకుల రసం మన శరీరంలో ఫ్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని వలన మలేరియా తగ్గుతుంది.
* చింతాకులు తినడం అవి మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి.
* చింతచిగురు మన శరీరంలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా కాపాడుతుంది.
* చింతచిగురు తినడం వలన అవి కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
* చింతాకుల్లో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీని తగ్గిస్తుంది.
* చింతచిగురు రసాన్ని తాగడం వలన బాలింతలలో పాల నాణ్యత పెరుగుతుంది.
Also Read : Bhagini Hastha Bhojanam : భగినీ హస్త భోజనం అంటే ఏంటి ? అన్నదమ్ములకు ఎందుకు భోజనం పెట్టాలి ?