Beauty Tips: కేవలం 5 రూపాయలతో మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చట.. అదెలా అంటే?
మామూలుగా ప్రతి ఒక్క స్త్రీ కూడా మెరిసే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతోపాటు బ్యూటీ పా
- By Nakshatra Published Date - 03:05 PM, Tue - 19 December 23
మామూలుగా ప్రతి ఒక్క స్త్రీ కూడా మెరిసే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతోపాటు బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైనా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్లాలి అనుకున్నప్పుడు వాటిలో అందంగా కనిపించడం కోసం వెంటనే బ్యూటీ పార్లర్లకు వెళ్లి అక్కడ వేలకు వేలు ఖర్చు పెట్టి మేకప్ లు వేయించుకోవడం లేదంటే ఫేషియల్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వాటికి ఎన్నో వేల ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే అలాంటివి చేసుకున్న రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఉంటాయి.
కానీ కేవలం ఐదు రూపాయలతో స్వీట్ షాప్ లో దొరికే ఫేషియల్ వేసుకున్నట్లయితే మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుందట. ఈ రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా ముఖానికి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ కోసం ఒక గిన్నెను తీసుకొని ఒక చెంచా పెరుగు తీసుకోవాలి. ఈ స్క్రబ్ కోసం పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరిగును మాత్రమే వాడాలి. దీనిలో ఒక చెంచా పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ లాగా చేయాలి. పెరుగుతో స్క్రబ్ చేసుకోవడం వలన ముఖంపై ఉండే జిడ్డు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మురికి లాంటివి అన్ని పోతాయి. మీ ముఖం స్మూత్ గా తయారవుతుంది.
ముఖంపై ఉండే టాన్ పోతే ఫేషియల్ రిజల్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగి ముఖానికి అలోవెరా జెల్లి పెట్టుకోవాలి. తర్వాత స్వీట్ షాప్ లో దొరికే గోల్డ్ పేపర్ లేదా సిల్వర్ పేపర్ ను తీసుకొని ఈ పేపర్ ని ముఖంపై మొత్తం పెట్టుకోవాలి. తర్వాత చేతితో అలవేరా జెల్ వేసుకొని ముఖాన్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మీ ముఖం తెల్లగా తయారవ్వాలంటే సిల్వర్ పేపర్ ను వినియోగించాలి.
గోల్డెన్ గ్లో కావాలనుకుంటే గోల్డ్ కలర్ పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. పార్లర్ కి వెళ్లి వేల వేల ఖర్చు చేసే వాళ్లు సిల్వర్ ఫేషియల్ లేదా గోల్డ్ ఫేషియల్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఈ ఐదు రూపాయలతో మనం ఇంట్లో చేసుకునే ఫేషియల్ ఈ విధంగా వేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఏదైనా ఫంక్షన్ కి పార్టీకి వెళ్లాలన్న క్షణాల్లో దీన్ని వేసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు ఉండదు. దీంతో మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. ఇన్స్టంట్ గ్లో కావాలి అనుకున్న వారు ఈ చిట్కాని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Related News
Turmeric: పసుపుతో అదిరే అందం మీ సొంతం.. బట్ బీ అలర్ట్, ఎందుకంటే
Turmeric: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఇంటిలో దొరికేవాటితో కూడా ప్రయత్నిస్తారు. తరచుగా ముఖానికి పసుపును ఉపయోగిస్తారు. అయితే పసుపును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మంచిదో కాదో తెలుసా? పసుపును శతాబ్దాలుగా చర్మానికి ఉపయోగిస్తున్నారు. కానీ పసుపును నేరుగా ముఖంపై పూయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఇది కాక