Baby Corn 65: ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ బేబీ కార్న్ 65 ఇంట్లోనే చేసుకోండిలా?
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్నాక్స్ కి బాగా అలవాటు పడిపోవడంతో సాయంత్రం అయ్యింది అంటే చాలు స్నాక్స్ కావాలన
- By Anshu Published Date - 08:30 PM, Thu - 20 July 23

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్నాక్స్ కి బాగా అలవాటు పడిపోవడంతో సాయంత్రం అయ్యింది అంటే చాలు స్నాక్స్ కావాలని అంటూ ఉంటారు. ఇక స్కూల్ కి వెళ్లి వచ్చిన పిల్లలు అలాగే ఆఫీస్ కి వెళ్లి వచ్చిన భర్తలు ఏదైనా స్నాక్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే గృహిణులకు ఈ స్నాక్స్ చేయడం అన్నది పెద్ద తలనొప్పి తో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఒకటే రకమైన స్నాక్స్ చేస్తే భర్త పిల్లలు విసుక్కుంటూ ఉంటారు. దానితో వాడికి ఎటువంటి స్నాక్స్ చేయాలి ఎటువంటి స్నాక్స్ చేస్తే పిల్లలు ఇష్టపడతారు అన్న విషయం తెలియక తికమకపడుతూ ఉంటారు. మరి అటువంటి వారి కోసం ఈ రెసిపీ. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఎంతో టేస్టీగా ఉండి బేబీ కార్న్ 65.. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి?అందుకోసమే ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బేబీ కార్న్ 65 కి కావాల్సిన పదార్థాలు :
బేబీ కార్న్ – అరడజను
కార్న్ – 1 స్పూన్
క్యాప్సికమ్ – 1
ఉల్లికాడలు – కొన్ని
పచ్చిమిర్చి – రెండు
చిన్న ఉల్లిపాయలు – రెండు
అల్లం – చిన్నముక్క
చిల్లీసాస్ – 1 స్పూన్
టమాటో కెచప్ – 1 స్పూన్
సోయాసాస్ – 1 స్పూన్
మిరియాల పొడి – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత.
బేబీ కార్న్ 65 తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా బేబీ కార్న్ ను నిలువుగా రెండు చీలికలుగా లేదా అడ్డంగా రెండు ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బేబీ కార్న్ ముక్కలు, మొక్కజొన్న పిండి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి, సరిపడా నూనె పోసి, బాగా కాగాక అందులో బేబీ కార్న్ ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి. ఇలా చేసేటప్పుడు, మంటను సిమ్ లో ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, చిన్న కళాయి పెట్టి, నూనె వేసి క్యాప్సికమ్, పచ్చిమిర్చి తరుగును, అల్లం వెల్లుల్లి తరుగును, ఉల్లికాడల తరుగును వేసి దోరగా వేపుకోవాలి. దోరగా వేగుతుండగా, అందులో చిల్లీసాస్, టమాటో కెచప్, సోయాసాస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో బేబీ కార్న్ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం, బేబీ కార్న్ కు బాగా పట్టించేటట్టు గరిటెతో కలపాలి. అంతే హోటల్ స్టైల్ బేబీ కార్న్ 65 రెడీ.