Aratikaya Bajji: ఎంతో స్పైసీగా ఉండే అరటి బజ్జి.. తయారీ విధానం?
మామూలుగా మనం సాయంత్రం సమయంలో అలాగే వర్షాకాలం సమయంలో వేడివేడిగా బజ్జీ వేసుకోవాలి అని తినాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే బజ్జి అనగానే
- By Anshu Published Date - 08:30 PM, Sun - 6 August 23

మామూలుగా మనం సాయంత్రం సమయంలో అలాగే వర్షాకాలం సమయంలో వేడివేడిగా బజ్జీ వేసుకోవాలి అని తినాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే బజ్జి అనగానే ఎక్కువగా చాలామంది ఆలు బజ్జి లేదంటే రిప్లై బజ్జీలు ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు ఒకే రకమైన కాకుండా అరటికాయ బజ్జీలు చేసుకుని తినడం వల్ల ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మరి అరటికాయ బజ్జికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అరటికాయ బజ్జికి కావాల్సిన పదార్ధాలు:
కూర అరటికాయలు – రెండు
సెనగపిండి – పావు కప్పు
బియ్యం పిండి – రెండు టేబుల్ స్పూన్స్
కారం – అర టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – పావు టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
వేడి నూనె – రెండు టేబుల్ స్పూన్స్
నీళ్ళు – తగినన్ని
నూనె వేపుకోడానికి – సరిపడా
అరటికాయ బజ్జి తయారీ విధానం:
అరటికాయ తొక్కని పల్చగా తీసేయ్యాలి. మరీ లోపల తెల్లగా ఉండే కండ కనపడేలా తీయకూడదు. తరువాత పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి. అరటికాయ బజ్జికి రెడీ చేసుకున్నవి అన్నీ సెనగపిండి లో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వేడి నూనె వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు చేర్చి పిండి జారుగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న శనగపిండిలో అరటికాయ ముక్కలు వేసి ఒక్కోక్కటి తీసి వేడి నూనె లో వేసి సన్నని సెగమీద లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి ఆ తరువాత సెగను పెంచుకోని ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉంది అరటికాయ బజ్జి రెడీ.