Andhra Special Royyala Eguru: ఆంధ్ర స్పెషల్ రొయ్యల ఇగురు.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
మామూలుగా రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి రకరకాల వంటలు తయారు చేయడం మనం చూస్తూ ఉంటాం.. అనగా
- Author Anshu
Date : 01-09-2023 - 7:30 IST
Published By : Hastagu Telugu Desk
మామూలుగా రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి రకరకాల వంటలు తయారు చేయడం మనం చూస్తూ ఉంటాం.. అనగా రొయ్యలతో తెలంగాణలో ఒక రకమైన వంటలు ఆంధ్ర స్టైల్ లో కొన్ని వంటలు కర్ణాటక స్టైల్ లో కొన్ని వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైన ఆంధ్ర స్పెషల్ రొయ్యల ఇగురు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆంధ్ర స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలి అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రొయ్యల ఇగురుకు కావలసిన పదార్థాలు:
రొయ్యలు – 500 గ్రాములు
దాల్చినచెక్క – కొద్దిగా
గరం మసాలా – 2 స్పూన్స్
నూనె – 25 గ్రాములు
పచ్చిమిర్చి – ఆరు
కొత్తిమీర తరుగు – చిన్న కప్
పసుపు – చిటికెడు
కరివేపాకు – రెండు రెమ్మలు
ఉల్లితరుగు – 2కప్
ఏలకులు – 6
జీడిపప్పు – 50 గ్రాములు
గసగసాలు: 2టీ స్పూన్
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్
రొయ్యల ఇగురు తయరీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లితరుగు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఏలకులు, పసుపు వేసి దోరగా వేయించాలి.
అందులో ఉడికించిన రొయ్యలు, జీడిపప్పు, పావు కప్పు నీరు వేసుకోవాలి. గసగసాలు, పచ్చి కొబ్బరి, ఏలకులు, చెక్క వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. చివరిలో కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి నీరులేకుండా దగ్గరికి వచ్చేవరకు ఉడికించాలి. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రొయ్యల ఇగురు రెడీ.