Aloo Batani Pulao: ఎంతో స్పైసీగా ఉండే ఆలు బఠాణి పులావ్.. తయారీ విధానం?
మామూలుగా పిల్లలు పెద్దలు ఇంట్లో ఏదైనా విశేషం ఉన్నప్పుడు, తినాలి అనుకున్నప్పుడు విజిటేబుల్ పులావ్, చికెన్ పులావ్ ఆలూ పులావ్ వంటివి తయారు చేసు
- By Nakshatra Published Date - 07:30 PM, Thu - 3 August 23
మామూలుగా పిల్లలు పెద్దలు ఇంట్లో ఏదైనా విశేషం ఉన్నప్పుడు, తినాలి అనుకున్నప్పుడు విజిటేబుల్ పులావ్, చికెన్ పులావ్ ఆలూ పులావ్ వంటివి తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఎప్పుడైనా సరికొత్తగా ఆలు బఠానీ పులావ్ తయారు చేసుకుని తిన్నారా. తినకపోతే ఆలూ బఠానీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలి?అందుకోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆలూ బటానీ పులావ్ కి కావాల్సిన పదార్ధాలు:
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
ఆలూ – ఒకటి
బటానీ – అర కప్పు
బిరియానీ ఆకు – ఒకటి
లవంగాలు – నాలుగు
యాలకులు – అయిదు
షాహీ జీరా – అర టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లులి – అర టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – రెండు
నానబెట్టిన బాసుమతి బియ్యం – ఒక కప్పు
పుదీనా తరుగు – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నీళ్ళు – 1.1/4 కప్పు
ఆలూ బటాని పులావ్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు ,యాలకులు, లవంగాలు, షాహీజీరా, వేసి వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని అందులోనే ఆలూ ముక్కలు కూడా వేసి ఇవి కూడా లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి. ఆలూ వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపాలి. తర్వాత ఎసరు నీళ్ళు పోసి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, బటానీ వేసి హై ఫ్లేమ్ మీద ఎసరు మరగనివ్వాలి. మరుగుతున్న ఎసరులోకడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం కొత్తిమీర పుదీనా వేసి కలిపి మూత పెట్టి 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపాలి. స్టవ్ ఆపిన వెంటనే దింపకుండా కుక్కర్ లో ఆవిరి పోయేదాక ఉంచి తర్వాత కుక్కర్ మూత తీసి రైతా లేదా స్పైసీ పనీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బటాని పులావ్ రెడీ.
Related News
Aloo Vankaya Curry: ఆలూ వంకాయ కూర.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
ఆలూ వంకాయ కూర.. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎక్కువగా శుభకార్యాలలో ఈ వంటకం తప్పకుండా