484 Jobs : టెన్త్ పాసయ్యారా ? బ్యాంకులో 484 జాబ్స్ మీకోసమే
పదో తరగతి పాసయ్యారా ? మీ వయసు 2023 మార్చి 31 నాటికి 26 ఏళ్లలోపు ఉందా ?
- By Pasha Published Date - 01:58 PM, Wed - 19 June 24

484 Jobs : పదో తరగతి పాసయ్యారా ? మీ వయసు 2023 మార్చి 31 నాటికి 26 ఏళ్లలోపు ఉందా ? అయితే ప్రభుత్వ బ్యాంకులో మీకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఏజ్ లిమిట్ గురించి టెన్షన్ వద్దు. ఎందుకంటే ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్(484 Jobs) విడుదల చేసింది. అర్హత ఉన్నవాళ్ల గడువులోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 21న ప్రారంభం అవుతుంది. జూన్ 27 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
- ఈ ఏడాది జులై/ఆగస్టులో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షకు 70 మార్కులు ఉంటాయి. ఆన్‌లైన్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ ఆర్థమేటిక్స్, సైకో మెట్రిక్ టెస్ట్ (రీజనింగ్), ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆగస్టు నెలాఖరుకల్లా దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి.
- ఈ ఏడాది సెప్టెంబరులో జోన్లవారీగా లోకల్ ల్యాంగ్వేజ్ టెస్టులు జరుగుతాయి. వీటికి 30 మార్కులు ఉంటాయి.
- లోకల్ ల్యాంగ్వేజ్ పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి.
- ఈ సంవత్సరం అక్టోబరులో అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ పై ప్రకటన చేస్తారు. అంటే ఉద్యోగాలకు ఎవరు ఎంపికయ్యారనేది వెల్లడిస్తారు.
Also Read :New Criminal Laws: జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు.. వాటిలో ఏముంది ?
మొత్తం 484 పోస్టులకుగానూ అహ్మదాబాద్ జోనులో 76, భోపాల్ జోనులో 38, ఢిల్లీ జోనులో 76, కోల్‌కతా జోనులో 2, లఖ్‌నవూ జోనులో 78, పుణె జోనులో 118, పట్నా జోనులో 96 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌కు అప్లై చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.19,500 – రూ.37,815 వరకు పే స్కేలు చెల్లిస్తారు.