Tokyo’s zero-tolerance gun laws: ప్రపంచంలోనే టఫ్ తుపాకీ చట్టాల దేశంలో దారుణం!
అమెరికా, యెమెన్ లాంటి దేశాల్లో తుపాకీ లైసెన్స్ లభించడం వెరీ ఈజీ. కానీ జపాన్ లో ఆ ప్రక్రియ ఎంతో కష్టం.. ఎంతో క్లిష్టం.
- By Hashtag U Published Date - 11:12 AM, Sat - 9 July 22
అమెరికా, యెమెన్ లాంటి దేశాల్లో తుపాకీ లైసెన్స్ లభించడం వెరీ ఈజీ. కానీ జపాన్ లో ఆ ప్రక్రియ ఎంతో కష్టం.. ఎంతో క్లిష్టం. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ను ఓ దుండగుడు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఆయనను హత్య చేసేందుకు దుండగుడు వినియోగించిన నాటు తుపాకీపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. జపాన్ లో నాటు తుపాకీ వినియోగం ఎందుకు జరుగుతోందనే అంశంపై చర్చ నడుస్తోంది.దీనిపై ఓ లుక్ వేద్దాం..
పోలీసులు, మిలిటరీకి తప్ప..
జీరో టాలరెన్స్ తుపాకీ చట్టాలకు జపాన్ పెట్టింది పేరు. అక్కడ పోలీసులు, మిలిటరీకి తప్ప ఎవ్వరికీ తుపాకీ ఉంచుకునే హక్కు లేదు. ఎవరికైనా తుపాకీ లైసెన్స్ కావాలంటే.. 13 అంచెల స్క్రీనింగ్ ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. గన్ లైసెన్స్ కోసం సుదీర్ఘ, సంక్లిష్ట స్క్రీనింగ్ చేసే దేశం జపాన్ మాత్రమే. గన్ లైసెన్స్ కావాలని భావించే వ్యక్తి, తుపాకీ షూటింగ్ పరీక్షలో 95 శాతం ఖచ్చితత్వం సాధించాలి. రాత పరీక్షలో నెగ్గి, హాస్పిటల్ లో మెంటల్ హెల్త్ చెకప్ ను కూడా క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ అధిగమిస్తేనే గన్ లైసెన్స్ చేతికి అందుతుంది. చేతిలో గన్ పెట్టడానికి ముందు.. దరఖాస్తుదారుడి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తారు. ఇవన్నీ జరిగాక గన్ లైసెన్స్ ఇస్తారు. మూడేళ్ళు గన్ వుంచుకోవచ్చు. జపాన్ లో తుపాకులతో జరిగే క్రైమ్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. ఎవరికైనా గన్ లైసెన్స్ కేటాయించినా.. అతడు చనిపోయాక గన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కాగా, ఎయిర్ గన్స్ వినియోగానికి , వాటిని ఉంచుకోవడానికి మాత్రమే పరిమిత అనుమతులు ఇస్తారు.
Related News
Mongolia: టీ20 క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 12 పరుగులకే ఆలౌట్..!
టీ20 క్రికెట్లో 200 పరుగులు చేయడం సర్వసాధారణమైపోయింది. IPL 2024లో 200 స్కోరు సురక్షితమైన స్కోరుగా చూడటంలేదు.