HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Union Budget 2025 Credit Cards For Street Vendors Pm Dhandhanya Yojana In 10 Districts

Street Vendors : వీధి వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలతో యూపీఐ క్రెడిట్ కార్డులు

ఈ  పథకం ద్వారా వీధి వ్యాపారులు(Street Vendors) రూ. 80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు పొందొచ్చు.

  • By Pasha Published Date - 12:12 PM, Sat - 1 February 25
  • daily-hunt
Credit Cards For Street Vendors Union Budget 2025

Street Vendors : వీధి వ్యాపారులకు కేంద్ర బడ్జెట్ నుంచి గుడ్ న్యూస్ వినిపించింది.  వారికి రూ.30వేలు విలువైన యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  ఈ కార్డులలోని డబ్బులను వీధి వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం వాడుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులను సరిగ్గా వాడుకొని, తదుపరిగా క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవచ్చు. ప్రత్యేకించి పట్టణాలు, నగరాల్లోని వీధి వ్యాపారులను ఈ క్రెడిట్ కార్డులను జారీ చేస్తారు.

Also Read :Hyderabad Mosque : హైదరాబాదీ మసీదుకు స్పెయిన్ టూరిస్టుల క్యూ.. ఎందుకు ?

జీవిత బీమా కవరేజీ కూడా..

‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి’ (PM SVANIdhi) అనే పథకం ద్వారా అర్హులైన వీధి వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డులను  జారీ చేస్తారు. వీధి వ్యాపారులు ఇకపై  ప్రభుత్వం గుర్తింపు కార్డులను పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.  అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 1 కోటి మంది వీధి వ్యాపారులకు జీవిత బీమా కవరేజీని కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. 2020 జూన్‌లోనే ‘ప్రధానమంత్రి స్వనిధి’ పథకాన్ని ప్రారంభించారు.  అప్పట్లో కరోనా సంక్షోభం వల్ల వీధి వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వారిని ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.

Also Read :Red Briefcase : బడ్జెట్ బ్రీఫ్‌‌కేస్ ఎరుపు రంగులోనే ఎందుకు ? ఎన్నో కారణాలు

గత సంవత్సరమే పీఎం స్వనిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ  పథకం ద్వారా వీధి వ్యాపారులు(Street Vendors) రూ. 80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు పొందొచ్చు. రెగ్యులర్‌గా రీపేమెంట్‌ చేస్తే 7 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. డిజిటల్ లావాదేవీల కోసం సంవత్సరానికి రూ. 1,200 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. కేవలం నగరాల్లోనే కాకుండా గ్రామీణ, పెరి-అర్బన్ ప్రాంతాలలో కూడా వీధి వ్యాపారులకు దీని ద్వారా మద్దతు ఇస్తారు. మొత్తం మీద ఈ స్కీం ఎంతోమంది వీధి వ్యాపారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Credit Cards
  • nirmala sitharaman
  • PM Dhandhanya Yojana
  • street vendors
  • Union Budget 2025

Related News

Trade War

Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  • Gst 2.0

    GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

  • Nirmala Sitharaman

    GST 2.0 – Nirmala Sitharaman : లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను

Latest News

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd