HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sonia Gandhi Welcomes Bharat Ratna For P V Narasimha Rao

Bharat Ratna to PV : పీవీకి భారతరత్న.. చిరంజీవి, సోనియా ఫుల్ హ్యాపీ

  • Author : Sudheer Date : 09-02-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pv Sonia
Pv Sonia

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈ ప్రకటన ఫై తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా..తాజాగా సోనియా గాంధీ , మెగా స్టార్ చిరంజీవి , రేవంత్ రెడ్డి తదితరులు తమ స్పందనను తెలియజేసారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) : ‘నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణం. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ఇండియాను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారతరత్నతో సత్కరించారు. భారతీయులందరికీ ఇది సంతోషకరమైన విషయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని సోనియా తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy): ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ పీఎం చరణ్ సింగ్, LK అద్వానీ, కర్పూరి ఠాకూర్, శాస్త్రవేత్త స్వామినాథన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం’ అని ట్వీట్ చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురికి భారతరత్న ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఐదుగురికి ఈ పురస్కారాన్ని ప్రకటించడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేదు. PM మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో నలుగురికి ప్రదానం చేశారు. ఈ ఏడాది LK. అద్వానీ, కర్పూరి ఠాకూర్, PV నరసింహారావు, MS స్వామినాథన్, చరణ్ సింగ్ కు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదిన నేత. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని పట్టాలెక్కించారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని..హరిత విప్లవం, ఎగుమతులు, టెలి కమ్యూనికేషన్, టెక్నాలజీతో దేశం స్వయంసమృద్ధి సాధించేలా చేశారు. ఇప్పుడు ఉన్న సాంకేతికతకు బీజం వేసింది ఈ మహనీయుడే. విద్యారంగంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు మన తెలుగు ఠీవీ పీవీ. అప్పులతో దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో PV నరసింహారావు ప్రధాని పదవి చేపట్టారు. 3 వారాల విదేశీ ద్రవ్య నిల్వలే మిగిలిన క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఆర్థిక ప్రగతిని ఆలస్యం చేసే, అవినీతిని పెంచే లైసెన్స్ రాజ్యాన్ని రద్దు చేసి భారత్లో ప్రపంచ వర్తకానికి ద్వారాలు తెరిచారు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ముఖచిత్రం మార్చి, సంక్షోభం నుంచి బయటపడేశాయి.

పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అలాంటి మాజీ ప్రధానికి భారత రత్న రావడం పట్ల యావత్ ప్రజలు , రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ..ప్రధాని మోడీకి థాంక్స్ చెపుతున్నారు.

Read Also : Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #CMRevanthReddy
  • Bharat Ratna
  • chiranjeevi
  • P. V. Narasimha Rao

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd